ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ అమలు అభినందనీయం
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:12 AM
ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్‌లకు జూన్ నుంచి యూనిట్‌కు రూ.1.50 పైసలు విద్యుత్ సబ్సిడీని అమలు చేయడం అభినందనీయమని పాలకొల్లు జైభారత్ క్షీరారామ ఆక్వాసంఘం చైర్మన్ బోనం చినబాబు అన్నారు.
రేపు పాలకొల్లులో ఆక్వా రైతుల భారీ బహిరంగ సభ : చినబాబు
పాలకొల్లు రూరల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్‌లకు జూన్ నుంచి యూనిట్‌కు రూ.1.50 పైసలు విద్యుత్ సబ్సిడీని అమలు చేయడం అభినందనీయమని పాలకొల్లు జైభారత్ క్షీరారామ ఆక్వాసంఘం చైర్మన్ బోనం చినబాబు అన్నారు. ఆదివారం పాలకొల్లులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సబ్సిడీ జీవో అమలు కోరుతూ రాష్ట్ర ఆక్వా సంఘం చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, సంఘ ప్రతినిధులు సీఎం చంద్ర బాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం స్పందించి అమలు చేసిందన్నారు. ఈమేరకు ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈమేరకు ఈనెల 11న పాలకొల్లు బైౖపాస్ రోడ్డులో ఆక్వారైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నట్టు తెలిపారు. ఈ సభకు మంత్రులను ఆహ్వానించామని రాష్ట్రంలోని ఆక్వా రైతులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి పెన్మెత్స సత్యనారాయణరాజు, రాష్ట్ర సంఘ సభ్యుడు సజ్జా వీరవెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.