ఆక్వా రైతుల ఆందోళన
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:58 AM
రొయ్యల మేత ధరలను నియంత్రించాలని ఆక్వా రైతులు మంగళవారం నిరసన తెలిపారు.
దుకాణాల బంద్ విజయవంతం
ఆకివీడు/పాలకొల్లు రూరల్/ పెనుమంట్ర/ గణపవరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రొయ్యల మేత ధరలను నియంత్రించాలని ఆక్వా రైతులు మంగళవారం నిరసన తెలిపారు. ఆక్వా మేత దుకాణాలు మూతపడ్డాయి. ఆకివీడు జాతీయ రహదారిపై మండుటెండలో ఆక్వా రైతులు రాస్తారోకో నిర్వహించి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఆర్‌ఐ ఆంజ నేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లా డుతూ దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో దాదాపు 70 శాతం ఏపీలోనే జరుగుతోందన్నారు. దేశానికి వేలకోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూరుతున్నా ఆక్వా రైతులు ఎన్నడూ లేనంత విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆక్వా పరిశ్రమకు ప్రభుత్వం ఊపిరి పోయాలన్నారు. ఆక్వా రైతులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, కోపల్లి రాంబాబు, కొటికలపూడి కృష్ణశ్రీ, మదన్‌కుమార్, గంగూరి–ఉషశ్రీ, శేషుబాబు, బొల్లా శేషుబాబు, కర్రి భగవాన్ రెడ్డి, గొట్టుముక్కల వర్మ, నంద్యాల శివ తదితరులు పాల్గొన్నారు. రొయ్య మేత ధరలు తగ్గించాలని, రొయ్య ధరలు పెంచాలని రాష్ట్ర ఆక్వా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పాలకొల్లులో ఆందోళన చేపట్టారు. ఆక్వా రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆక్వా మేత, మందుల దుకాణాలన్నీ మూసి వేయించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు మాట్లాడుతూ రొయ్యల మేత ధరలను తగ్గించాలని సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు మేత కంపెనీలను ఆదేశించడంతో కేజీకి రూ.4లు తగ్గిస్తామ ని చెప్పిన కంపెనీలు కంటితుడుపుగా రూ.2లు మాత్రమే తగ్గించి అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యకు మాత్రం సరైన ధర లేక ఆర్థికంగా అప్పులు పాలవు తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పం దించి మేత, మందుల ధరలు తగ్గించాలనీ, రొయ్యకు గిట్టుబాటు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. సంఘ నాయ కులు గుంటూరి చంటిరాజు, మేడిద జాన్ డేవిడ్‌రాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు, వేగేశ్న శ్రీహరిరాజు, గుబ్బల హరిప్రసాద్, కణపతి నరసింహరాజు, సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట్ర మండలంలో ఆక్వా షాప్ అండ్ మెడిసిన్ షాపుల యజమానులు షాపులు స్వచ్చందంగా మూసి వేసి నిరసన తెలిపారు. మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భూపతిరాజు రాజు వెంకట శ్రీనివాసరాజు, గాదిరాజు వెంకట సాయి రామరాజు, పల్లంరాజు, కృష్ణంరాజు, వెంకటరెడ్డి, బాపిరెడ్డి, కుసంపూడి సతీష్, కనకరావు, ఆదినారాయణ, దాట్ల సురేష్ పాల్గొన్నారు. గణపవరం మండలంలో ఆక్వాషాపుల బంద్ విజయవం తమైంది. రైతులు ఉదయం రోడ్లపైకి వచ్చే సమ యానికే షాపులన్ని స్వచ్ఛందంగా మూసి వేశారు. షాపుల యాజమానులు రైతులు చేస్తున్న బంద్‌కు సహకరించటంతో రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కలిదిండిలోనూ మేత దుకాణాలు మూతపడ్డాయి.