ఆక్వా రైతులపై ధరల బాంబ్
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:25 AM
సిద్ధాపురానికి చెందిన రైతు వరుసగా నాలుగు క్రాప్‌లు నష్టపోయాడు. ఇప్పుడు వేసిన క్రాప్ బాగుంది. 100 కౌంట్‌లో పట్టడానికి సిద్ధమయ్యాడు.
ఆక్వా రైతులపై ధరల బాంబ్
రోజుకో ధరతో బెంబేలు
70 నుంచి 40 కౌంటు కొనేవారే లేరు.. 60, 70 కౌంట్లకు ఒకటే ధర!
100 కౌంటు ధర రూ. 250 అయినప్పటికీ టన్నేజీతో లెక్క
సాకులతో కొనుగోలు చేయని కంపెనీలు.. దళారుల ఇష్టారాజ్యం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా రైతుల ఆందోళన
సిద్ధాపురానికి చెందిన రైతు వరుసగా నాలుగు క్రాప్‌లు నష్టపోయాడు. ఇప్పుడు వేసిన క్రాప్ బాగుంది. 100 కౌంట్‌లో పట్టడానికి సిద్ధమయ్యాడు. రూ.270 పలికిన ధర ఒక్కసారిగా 250కి పడిపోయింది. అయినకాడికి అమ్ముదామంటే మూడు టన్నులు సరుకు ఇస్తేనే ఆ ధర. లేదంటే రూ.240 కడతామని ట్రేడర్స్ మాయాజాలం. రెండు టన్నులు అమ్మితే రూ.250 చొప్పున ఇప్పటికే రూ.40 వేలు నష్టపోతాడు, టన్నేజీ తగ్గితే ఇంకో పది రూపాయలు చొప్పున మరో పది వేలు నష్టపోతాడు. కేవలం యుద్ధం వల్ల చేతి కొచ్చిన పంటను అమ్ముకుందామం టే కేవలం పది రోజులలో రూ. 50 వేలు వరకు నష్టపోయాడు. ఇలా ఉంది ఆక్వా రైతుల పరిస్థితి. పంట బాగున్నా సొమ్ము చేసుకోలేని దుస్థితి.
ఆకివీడు రూరల్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది ఆక్వా రైతుల పరిస్థితి. అమెరికా ఆంక్షల సడలింపుతో ఆక్వా రైతులు ఉత్సాహంతో సాగు ప్రారంభించారు. వారి ఉత్సాహం ఎంతో సేపు లేదు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ఎగుమతులు ఆగిపోయాయి. ఇదే సాకుగా ట్రేడర్లు, కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించేశాయి. రూ. 270 ఉన్న 100 కౌంటు రొయ్యలు ధర రూ.250కి తగ్గించేశారు. అది కూడా టన్నేజీ ప్రకారం ధర ఇస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ధర తగ్గిపోయిందని, మున్ముందు ఇంకా తగ్గిపోతుందని ప్రచారం ప్రారంభించారు. వైరస్‌తో తీవ్రంగా నష్టపోతూనే అయినకాడికి అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు రైతులు. యుద్ధం వల్ల ఇబ్బందులు లేకున్నా చాలా మంది రైతులు తమ సరుకు అమ్మేశారు. యుద్ధం భయం, వైరస్ ఇబ్బందితో రైతుల కంగారును ట్రేడర్లు, కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. 70 కౌంటు నుంచి 40 కౌంటు వరకు అసలు అవసరం లేదని, పట్టుబడులు పట్టడానికి వాహనాలు లేవని రైతులకు చెబుతు న్నారు. అమెరికాకు ఎక్కువగా 70 నుంచి 40 వరకు కౌంటు ఉన్న రొయ్యలు ఎగుమతి అవుతాయి. యుద్ధం వల్ల వలన ఎగుమతులు తగ్గిపోవడంతో ధరలు తగ్గించి అయినకాడికి అమ్ముకునేలా రైతులను అవస్థలపాలు చేస్తున్నారు. 100 కౌంటు ధర రూ. 250 ఇవ్వాలంటే మూడు టన్నులు రొయ్యలను ఇవ్వాలని నిబంధనలు పెడుతున్నారు. టన్ను రొయ్యలు ఉంటే మాత్రం రూ. 10 తగ్గించి 240కే కొనుగోలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతు న్నందున కంపెనీలలో పనిచేసేవాళ్ళు తమ స్వ రా ష్ర్టాలకు వెళ్ళిపోయారని, మార్చి నెలాకరు కావడంతో ఖాతాల తనిఖీలు పేరుతో కొనుగోళ్లు నిలిపి రైతులను ఇబ్బంది పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ట్రేడర్స్, కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం కుదుట పడుతుందనుకున్న ఆశలు అడియాశ లైపో యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపె నీలు, ట్రేడర్లు, షెడ్‌లు వారు దోచేస్తున్నారని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. వీరవాసరంలో ఆక్వా రైతు సదస్సులో తమ సమస్యలపై గళం విప్పినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్లు, యూనిట్ ధర తగ్గింపు ఇప్పటి వరకు అమలు జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభు త్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
60–70 కౌంటులకు ఒకటే ధర
సాధారణంగా రొయ్య కౌంటు.. కౌంటుకు ధరలో తేడా ఉంటుంది. అయితే ట్రేడర్స్, కంపెనీలు మయా జాలం వల్ల ప్రస్తుత మార్కెట్‌లో 60–70కౌంటు ధర ఒక్కటే పలుకుతున్నది. గతంలో అయితే సుమారు 40 రూపాయల వరకు తేడా ఉండేది. రైతులకు కౌంటు వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది. 70 కౌంటు నుంచి 60 కౌంటుకు రావాలంటే పది రోజులుపాటు, ఫీడింగ్, మెడిసిన్స్, మినరల్స్ వంటివి అనేక ఉప యోగించేందుకు ఖర్చు వేలలో అవుతుంది. అయినప్ప టికి ఒకటే ధరతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
క్రాప్ హాలీడే ప్రకటించాలి
పిల్లా బాబులు, ఆక్వా రైతు, జనసేన నాయకుడు
రొయ్యలు రైతులు క్రాప్ హాలీ డే ప్రకటించాలి. ఐక్యంగా ముం దుకు రాకపోతే ఈ దోపిడిని అరి కట్టలేం. రాజకీయ నాయకులు ప్రభావం ఈ ఆక్వారంగంపై అధి కంగా ఉంది. దీనివల్ల నష్టపోయేది రైతులే.
ప్రభుత్వం పట్టించుకోవాలి
కఠారి రాము, ఆక్వారైతు, పెదకాపవరం
ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలబడాలి. దోపిడీని ప్రభుత్వం అరికట్టాలి. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆక్వా రంగం తీవ్రంగా నష్టాల పాలవుతుంది.