Share News

ఇక సచివాలయాల్లోను.. అర్జీల స్వీకరణ

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:45 AM

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పేరుకు పోతున్న ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా వినూత్న ఆలోచనలతో అడుగులు వేస్తోంది. ఇక స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయాల్లోను రోజూ అర్జీలను స్వీకరి స్తారు.

ఇక సచివాలయాల్లోను.. అర్జీల స్వీకరణ
సచివాలయాల్లో అర్జీల స్వీకరణపై అవగాహన కల్పిస్తున్న జిల్లా సచివాలయాల అధికారి వెంకట నాయుడు

విధిగా ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు సిబ్బంది కార్యాలయంలో ఉండాల్సిందే..

సెలవు రోజు మినహా పనిరోజుల్లో తప్పనిసరిగా అమలు

ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు ఇది దోహదం

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పేరుకు పోతున్న ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా వినూత్న ఆలోచనలతో అడుగులు వేస్తోంది. ఇక స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయాల్లోను రోజూ అర్జీలను స్వీకరి స్తారు. ప్రజలకు ఇవి అతి చేరువలో ఉండ డంతో వీటి సేవలను మరింతగా వినియో గించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుం ది. సెలవు రోజులు మినహా రోజూ సాయం త్రం వేళల్లో సచివాలయాల సిబ్బంది ప్రజల కు అందుబాటులో ఉండడం తప్పనిసరి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రజల సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించే వేదికగా స్వర్ణ, గ్రామవార్డు సచివాలయాలను వినియోగించడానికి ప్రభు త్వం నిర్ణయించింది. కలెక్టరేట్‌, డివిజనల్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో మాదిరిగా సచివాల యాల్లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కింద అర్జీలను స్వీకరించనున్నారు. దీంతో అన్ని కేడర్లలోని ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విధులకు డుమ్మా కొట్టిన సచివాలయాల ఉద్యోగుల పనితీరు మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎంతో వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్‌, డివిజన్‌, గ్రామ, పట్టణ స్థాయిల్లోని అర్జీదారులు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇక ఈ విధమైన అర్జీదారులను కాల క్రమేణా తగ్గించే దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ మెమో జారీ చేశారు.

విస్తృతంగా అవగాహన

జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో ఇక అన్ని రోజుల్లోనే వినతుల స్వీకరణ చేపట్టడం, అర్జీదారులతో ఎలా మర్యాదగా మాట్లాడాలనే దానిపై జిల్లా సచివాలయాల అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు అవగాహన కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో డీఎల్‌ డీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలను, పంచాయతీ డెవలప్‌మెంట్‌ అధికారులను భాగస్వామ్యం చేశారు. వినతులు ఇచ్చాక.. అవి ఏ విధంగా పరిష్కారమయ్యాయో తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌ వినియోగంపై ప్రజలకు అవగా హన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విధుల్లో ఉండాల్సిందే.. ఆదేశాలు

సచివాలయాల సిబ్బంది డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు మినహా.. ఇక ప్రతిరోజు సాయం త్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రజలకు ఆయా వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశాలను జారీ చేసినట్టు జిల్లా సచివాలయాల అధికారి వెంకట నాయుడు తెలిపారు. ఎన్ని పనులు ఉన్నా ఉదయం కార్యాల యానికి రాగానే వాటిని పరిష్కరించుకోవాలని, క్షేత్రస్థాయికి వెళ్లిన వారు విధిగా సాయంత్రం మూడు గంటలకు పనిచేసే చోటుకు చేరుకుని వినతులు స్వీకరించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహ రించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:46 AM