ఇల్లు ఇవ్వండి..
ABN , Publish Date - May 26 , 2026 | 12:14 AM
ఇళ్ల నిర్మాణానికి గతంలో తక్కువ రాయితీ కావడంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
స్థలం ఉన్నవారిని గుర్తించిన గృహ నిర్మాణ శాఖ
రాయితీ నిర్ధారించిన ప్రభుత్వం
అనుమతి కోసం ఎదురుచూపులు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
సొంత స్థలం ఉంది. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ప్రభుత్వం చేయూతనిస్తే ఇళ్లు నిర్మించుకుంటాం. ఎప్పుడు ఇస్తారంటూ కూటమి నేతలను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రాయితీ రాకపోవడం వల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇళ్ల నిర్మాణానికి గతంలో తక్కువ రాయితీ కావడంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. సొంత స్థలాలు ఉన్న వారంతా బిల్లులు మంజూరు కావన్న ఉద్దే శంతో వెనుకడుగు వేశారు. కూటమి ప్రభు త్వంలో ఇళ్ల నిర్మాణానికి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గ్రామా ల్లో జల్లెడ పట్టారు. సొంత స్థలంతోపాటు, ఇళ్లులేని అర్హుల జాబితా సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 16,900 మంది ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ అనుమతులు కోసం చూస్తున్నారు. కేంద్రం నుంచి సమ్మతి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేస్తుందని అధి కారులు చెబుతున్నారు. లబ్ధిదారులంతా ఇప్పు డు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
రాయితీ పెంచిన ప్రభుత్వం
వైసీపీ హయాంలో ఇంటికి రూ. 1.80 లక్షల పెట్టుబడి చేయూతనందించారు. పట్టణాలు, పల్లె తేడా లేకుండా ఆ మొత్తాన్నే అమలు చేశారు. ప్రస్తుతం పట్టణాల్లో ప్రభు త్వ చేయూతను రూ.2.50 లక్షలకు పెంచారు. జిల్లాలో 590 ఇళ్లను మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు బ్యాంకు రుణంతో సహా ఒక్కో ఇంటికి రూ.2.38 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఎంతగానో ప్రయోజనమని లబ్ధిదా రులు ఆశిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0లోనే సొంత స్థలాలున్న వారికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ అన్ని చర్యలు తీసుకుం ది. ఆన్‌లైన్‌లో అర్హుల జాబితాను నమోదు చేసింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే లబ్ధిదా రులు ఇళ్లు నిర్మించునేలా చర్యలు తీసుకో నున్నారు. గ్రామ సచివాలయాల ద్వారానే నిధులు మంజూరు చేయనున్నారు.