అమ్మాయిలదే హవా
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:44 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ (ఎప్) సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు.
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
ఏలూరు అర్బన్, జూలై 1 (ఆంరఽధజ్యోతి):ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ (ఎప్) సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు 3,816 మంది పరీక్షకు హాజరుకాగా 2,766 మంది అర్హత సాధించగా, వీరిలో బాలురు 1,281 మంది, బాలికలు 1,485 మంది ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు 1,474 మంది పరీక్ష రాయగా 1,347 మంది అర్హత సాధించారు. వీరిలో 1046 మంది బాలికలు, 301 మంది బాలురు ఉన్నారు. మొత్తంగా ఎప్‌సెట్‌లో అమ్మా యిలే ఆధిక్యత కనబరిచారు.
అగ్రికల్చర్, ఫార్మసీ టాపర్లెవరంటే..
అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో 88.37 స్కోరుతో రాష్ట్రంలో 15, జిల్లాలో ప్రథమ ర్యాంకర్‌గా ఏలూరుకు చెందిన యర్రా అభిజ్ఞ శ్రీనిధి, 86.05 స్కోరుతో రాష్ట్రంలో 39, జిల్లాలో ద్వితీయ ర్యాంకర్‌గా బుట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెంకు చెందిన నిమ్మగడ్డ వినమ్ర, 84.65 స్కోరుతో రాష్ట్రంలో 64, జిల్లాలో తృతీయ ర్యాంకర్‌గా జంగారెడ్డిగూడెం మండలం అయ్యవారిపోలవరానికి చెందిన కొట్టే వెంకట శ్రీకార్తీక్, 83.24 స్కోరుతో రాష్ట్రంలో 93, జిల్లాలో 4వ ర్యాంకర్‌గా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేటకు చెందిన వాడపల్లి వెంకట రాధాలక్ష్మి, 82.85 స్కోరుతో రాష్ట్రంలో 105, జిల్లాలో 5వ ర్యాంకర్‌గా ఏలూరు సత్రంపాడుకు చెందిన పల్లి జయ హనుమారెడ్డి, 82.81 స్కోరుతో రాష్ట్రంలో 106, జిల్లాలో 6వ ర్యాంకర్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన బూడిగిన లలితారాణి, 79.83 స్కోరుతో రాష్ట్రంలో 166, జిల్లాలో 7వ ర్యాంకర్‌గా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన సుఖవాసి ప్రసన్నకుమార్, 79.04 స్కోరుతో రాష్ట్రంలో 201, జిల్లాలో 8వ ర్యాంకర్‌గా నూజివీడుకు చెందిన ఇందుపల్లి దైవిక్ జోస్, 78.45 స్కోరుతో రాష్ట్రంలో 219, జిల్లాలో 9వ ర్యాంకర్‌గా ఏలూరు సత్రంపాడుకు చెందిన చౌదరి ధరణి శ్రీవాణి, 76.92 స్కోరుతో రాష్ట్రంలో 285, జిల్లాలో 10వ ర్యాంకర్‌గా ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన పసల శశాంక్ సాయి జిల్లాస్థాయి టాప్–10 ర్యాంకర్లుగా నిలిచారు.
జిల్లాస్థాయి ఇంజనీరింగ్ టాపర్లు వీరే..
ఇంజనీరింగ్‌లో 87.54 శాతం కంబైన్ (ఇంటర్మీడియట్ వెయిటేజి, ఎప్‌సెట్) స్కోరుతో రాష్ట్రస్థాయిలో 36, జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి పెదపాడు మండలం నాయుడుగూడెంకు చెందిన చిన్ని పవన్‌తేజ నంబర్‌వన్‌గా నిలిచాడు. మొత్తం 87.41 స్కోరుతో రాష్ట్రంలో 37వ ర్యాంకు, జిల్లాలో ద్వితీయ ర్యాంకర్‌గా ఉంగుటూరుకు చెందిన పాతూరి జయదేవ్, 78.25 స్కోరుతో రాష్ట్రంలో 190వ ర్యాంకు, జిల్లాలో తృతీయ ర్యాంకర్‌గా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన మరడ శ్రీవాత్సవ సాయితేజ, 77.36 స్కోరుతో రాష్ట్రంలో 220, జిల్లాలో 4వ ర్యాంకుతో నిడమర్రు మండలం మందలపర్రుకు చెందిన బూరాడ కౌశల్, 76.73 స్కోరుతో రాష్ట్రంలో 254, జిల్లాలో 5వ ర్యాంకర్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన లకంసాని మాధవన్, 76.48 స్కోరుతో రాష్ట్రంలో 265, జిల్లాలో 6వ ర్యాంకర్‌గా ముసునూరు మండలం ఏళ్లపురానికి చెందిన మానికల హృదయ్, 75.94 స్కోరుతో రాష్ట్రంలో 284, జిల్లాలో 7వ ర్యాంకర్‌గా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన కూసం ప్రేమ్‌కుమార్ రెడ్డి, 75.76 స్కోరుతో రాష్ట్రంలో 294, జిల్లాలో 8వ ర్యాంకర్‌గా నిడమర్రు మండలం బువ్వనపల్లికి చెందిన సంకు యశ్వంత్ ఫణికుమార్, 75.51 స్కోరుతో రాష్ట్రంలో 305, జిల్లాలో 9వ ర్యాంకర్‌గా కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన కర్రి సత్యభాస్కర్, 73.41 స్కోరుతో రాష్ట్రంలో 427, జిల్లాలో 10వ ర్యాంకర్‌గా చింతలపూడి మండలం పాతచింతలపూడికి చెందిన మారుమూడి యశ్వంత్ జిల్లాస్థాయి టాప్–10 ర్యాంకర్లుగా నిలిచారు.