Share News

పరిశోధనల నాణ్యతతోనే అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:16 AM

పరిశో ధనల నాణ్యతతోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి చంద్రశేఖర్‌ శర్మ, జీకేసీఐఈటీ మాల్డా మాజీ ప్రొఫెసర్‌ ఆలపాటి పరమేశ్వరరావు అన్నారు.

పరిశోధనల నాణ్యతతోనే అంతర్జాతీయ గుర్తింపు
అతిథులను సత్కరిస్తున్న నిట్‌ ఆచార్యులు

తాడేపల్లిగూడెం అర్బన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పరిశో ధనల నాణ్యతతోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి చంద్రశేఖర్‌ శర్మ, జీకేసీఐఈటీ మాల్డా మాజీ ప్రొఫెసర్‌ ఆలపాటి పరమేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో మంగళవారం ‘పరిశోధన, అభివృదిఽ్ధ’ అనే అంశంపై ఆచార్యులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరిశోధనలో నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిధుల సాధనకు సమర్థవంతమైన పరిశోధన ప్రతి పాదనలు కీలకమన్నారు. పరిశోధనకు సరైన సమస్యను ఎంపిక చేసుకోవడం నుంచి ప్రతిపాదన తయారీ వరకు ప్రతి దశలో శాస్త్రీయ దృక్పథం అవసర మన్నారు. అనంతరం అతిఽథులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో డీన్‌లు డాక్టర్‌ జి.రవికిరణ్‌శాస్త్రి, డాక్టర్‌ కార్తికేయశర్మ, డాక్టర్‌ తపస్‌ పరమాణిక్‌, డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ జీబీ వీరేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:16 AM