కేంద్రం కరుణించాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:31 AM
అభివృద్ధికి రూ.420 కోట్లు మంజూరు చేయాలని నాలుగేళ్ల క్రితమే ఏపీ నిట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అధికారుల సూచనల మేరకు దీనిని మళ్లీ సవరించి పంపించారు.
ఏపీ నిట్‌కు రూ.420 కోట్లు ఇవ్వాలి.. అప్పుడే మెరుగైన ఫలితాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి) పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ నిట్) బోధన నుంచి పరి శోధనల వరకు మెరుగైన ఫలితాలు సాధించాలంటే నిధులు అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిట్ ఏర్పాటు చేసే నిట్ కు సుమారు రూ.1100 కోట్లు కేటాయి స్తుంది. రాష్ట్ర విభజన సమయంలో త్వరిత గతిన దీనిని ఏర్పాటు చేసేందుకు రూ.500 కోట్లలోపే ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించింది. ఆ మొత్తంతో శాశ్వత క్యాంపస్ నిర్మించారు. ఏటా 750 మంది విద్యార్థులకు అడ్మిషన్‌లు కల్పించే స్థాయికి చేరింది. తర్వాత మళ్లీ తిరోగమనం ప్రారంభమైంది. గత ఏడాది నుంచి 480 సీట్లకే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీనిని అధిగమించాలంటే రెగ్యులర్ ఫ్యాక ల్టీని నియమించాలి. విద్యార్థులకు వసతులు కల్పించాలి. ల్యాబ్‌లను అభివృద్ధి చేయాలి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థ అభివృద్ధికి రూ.420 కోట్లు మంజూరు చేయాలని నాలుగేళ్ల క్రితమే ఏపీ నిట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అధికారుల సూచనల మేరకు దీనిని మళ్లీ సవరించి పంపించారు. దీనిని హయ్యర్ ఎడ్యుకేషనల్ ఫైనాన్స్ కమిటీ ద్వారా నిధు లు కేటాయించాలి. కాని, రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడంతో కేంద్రంతో సంప్రదింపులు చేసే పరిస్థితి లేకపోయింది. రాష్ట్ర ప్రభు త్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వాస్త వానికి ఈ నిధులు కెనరా బ్యాంక్ నుంచి రుణం రూపంలో మంజూరుచేస్తారు. ఇందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే, మిగిలిన 10 శాతం ఏపీ నిట్ భరించాలి. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలి.