థాంక్యూ సీఎం సార్
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:31 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పలు డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఏలూరులో ఉద్యోగ సంఘాల సంబరాలు
తమ సమస్యలపై సీఎం సానుకూలత.. హర్షం
చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
ఏలూరు రూరల్, సెప్టెంబరు 5(ఆంధ్ర జ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పలు డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయాలకు కృతజ్ఞతగా శనివారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ర్యాలీ నిర్వహించారు. చంద్ర బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి బాణ సంచా కాల్చి, కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఏపీ జేఏసీ ఏలూరు జిల్లా చైౖర్మన్, ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగులకు ఇది శుభదినమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పలు ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారని, డీఏలు ఇతర బకాయిల కోసం ఎదురు చూడా ల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కూట మి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా ఉద్యో గుల్లో కొంత నిరాశ ఉన్నా సీఎం చంద్ర బాబు తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఉద్యో గుల్లో మరల ఆశలు, ఆనందాన్ని నింపాయ న్నారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం, 2026 అక్టోబరు 1 నుంచి రెండు డీఏల చెల్లింపు, 2022 సరెం డర్ లీవ్స్‌కు వచ్చే సంక్రాంతికి చెల్లించడం, పోలీసులకు అదనపు సరెండర్ లీవ్‌కు దసరాకు చెల్లిం చడం వంటి నిర్ణయాలు హర్షనీయమ న్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిం చిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఉద్యో గుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హర నాథ్, కార్యదర్శి నేర్పు రామారావు, కోకన్వీ నర్ రుద్రాక్షి రవి, నాయకులు కేఆర్ పవన్ కుమార్, మోహన్, ఏపీ ఎన్జీవో మహిళ విభాగం చైర్‌పర్సన్ కె.సునీత పెద్ద సంఖ్యలో నాయకులు ఉద్యోగుల పాల్గొన్నారు.
సీఎం సానుకూల నిర్ణయాలు హర్షణీయం
ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు సాను కూలంగా స్పందిం చడం హర్షణీయం. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకరించడంతో పాటు 2026 అక్టోబరు 1 నుంచి 1–7–2024, 1–1–2025 డీఏలు చెల్లించేందుకు నిర్ణయించడం అభినంద నీయం. 2022 సరెండర్ లీవ్స్‌ను వచ్చే సంక్రాంతికి, పోలీసులకు అదనపు సరెండర్ లీవ్‌ను దసరాకు చెల్లించనున్నారు. అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి 2027 నుంచి అమలు చేయడంతో పాటు 70 ఏళ్లు దాటిన వారికి 10శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15శాతం పెన్షన్ పెంపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను స్ట్రీమ్ లైన్ చేయనున్నారు.
– భూపతిరాజు రవీంద్రరాజు, ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం..
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు హర్షణీయం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించి, ఉద్యోగుల ప్రధాన సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించడం ఉద్యోగుల పట్ల ఆయన కున్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేయడం సంతోషకరం. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఉద్యోగులు మరింత కష్టపడి పని చేస్తాం.
– ఆర్‌ఎస్ హరనాథ్, ఏపీ ఎన్జీవోస్, ఉపాధ్యాయుడు
ఉద్యోగులకు చంద్రబాబు అండ.. ఇది శుభదినం
ఈరోజు ఉద్యోగులకు శుభదినం. ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతో భరోసా నిచ్చాయి. ఉద్యోగులకు చంద్రబాబు ఎప్పుడూ అండగా ఉంటారనే విషయం మరోసారి రుజువైంది. ముఖ్యంగా 12వ పీఆర్సీ నియామకానికి ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయం. దీనివల్ల ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగల సమస్యలను అర్ధం చేసుకుని, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.
– చోడగిరి శ్రీనివాస్, ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు