ఉద్యమంతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:26 PM
ఉద్యో గుల హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైౖర్మన్ కె.రమేష్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు, పశ్చిమ జిల్లాల చైర్మన్‌లు రమేష్‌కుమార్, సత్యనారాయణ
28న విజయవాడలో సదస్సు
ఏలూరు రూరల్/భీమవరంటౌన్ ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి) : ఉద్యో గుల హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైౖర్మన్ కె.రమేష్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు రెవెన్యూ భవన్‌లో జిల్లాస్థాయి సమావేశం రమేష్‌కుమార్ అధ్యక్షతన, భీమవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన ర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈనెల 28న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర ఛైర్‌పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగే రాష్ట్ర సదస్సుకు వేలాదిగా ఉద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏలూరులో జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, మహిళా విభాగం ఛైర్‌పర్సన్ గీతిక, వైస్ చైౖర్మన్ బి. సత్యనారాయణ, నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు జ్యోతి, జిల్లా అధ్యక్షుడు కమల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షుడు వర్మ, కృష్ణస్వామి, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఏపీ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్‌పర్సన్ డి.సుగుణ సంధ్య, వైస్ చైర్మన్ బి.అరుణ, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు