Share News

ఉద్యాన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:54 AM

రైతులకు మంచి ఆదాయం వచ్చేలా ఉద్యాన పంటలకు ప్రోత్సా హం అందిస్తున్నామని వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు.

ఉద్యాన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు..

ఏలూరు కోకో కాంక్లేవ్‌ రాష్ట్ర సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు

ఏలూరు సిటీ, జనవరి 30(ఆంరఽధజ్యోతి): రైతులకు మంచి ఆదాయం వచ్చేలా ఉద్యాన పంటలకు ప్రోత్సా హం అందిస్తున్నామని వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరులో శుక్రవారం రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ‘కోకో ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం రూ.50 వేల కోట్లు ఉంటే ఉద్యానవన శాఖ రూ.లక్షా 68 వేలు కోట్లు ఉంది. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తిపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కల్పించటమే సదస్సు ప్రధాన ఉద్దేశం. త్వరలో విజయవాడలో అంతర్జాతీయ కాంక్లేవ్‌ను నిర్వహిస్తాం. మంత్రిని కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు, అధికారులు సత్కరించారు. కోకోలో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణపై కరపత్రాలను ఆవిష్కరించారు.

రాష్ట్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ఈ సదస్సులో నాణ్యమైన కోకో ఉత్పత్తి, ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ, బ్యాంకర్ల సహకారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో దేశంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంద న్నారు. జిల్లాలో 100 ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటులో భాగంగా డ్వాక్రా సంఘాలతో ఏడు చాక్లెట్‌ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తికి ఈ సదస్సులో శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ సదస్సులో శాస్త్రవేత్తల సూచనలతో కోకో రైతులు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన కోకో అధిక దిగుబడి సాధించాలన్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో దేశంలో చింతలపూడి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. చాకోలేట్‌ ఆరోగ్యానికి మంచిదన్నారు.

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ జిల్లాలో కోకో ప్రొసెసింగ్‌ యూనిట్లు, చాక్‌లేట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.

ఉద్యానవన శాఖ కమిషనర్‌ కె.శ్రీనివాసులు, ఏలూరు ఉద్యానవన శాఖాధికారి కె.సాజానాయక్‌, వ్యవసా యాధికారి హబీబ్‌ బాషా, ఇడా చైర్మన్‌ శివప్రసాద్‌, ఏలూరు ఏఎంసీ చైర్మన్‌ పార్థసారథి, ఆర్డీవో అంబరీష్‌, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, హార్టీకల్చర్‌ వీసీ, ఉద్యానశాఖాధికారులు, జాతీయ సంస్థల డైరెక్టర్లు, అధిపతులు, సీపీసీఆర్‌ఐ, డీసీసీడీ, కేఏయూ, సీఏఎంపీసీఓ, ఐఐ హెచ్‌ఆర్‌, వైఎస్‌ ఆర్‌హెచ్‌యు పరిశోధన సంస్థలు, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు, కోకో ప్రోసెసింగ్‌ పెట్టుబడిదారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:54 AM