Share News

ఎనీవేర్‌ మోసం !

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:22 AM

కృష్ణా జిల్లాకు చెందిన భూమి విషయంలో పైఅధికారులు సిఫారసు చేశారంటూ ఉండి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో తొమ్మిది సెంట్ల స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేశారు.

ఎనీవేర్‌ మోసం !

అమ్మకందారులు వేరే ప్రాంతం వారు.. రిజిస్ట్రేషన్లు ఇక్కడే..

ఈ ప్రక్రియలో మోసాలు..

సబ్‌ రిజిస్ర్టార్లకు పైనుంచి సిఫార్సులు.. భారీగా ముడుపులు

కృష్ణా జిల్లాకు చెందిన భూమి విషయంలో పైఅధికారులు సిఫారసు చేశారంటూ ఉండి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో తొమ్మిది సెంట్ల స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేశారు. సదరు భూమి తనదంటూ వేరొక వ్యక్తి ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టారు. రిజిస్ర్టేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ర్టార్‌ బలైపోయారు. ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ వేరొక సబ్‌ రిజిస్ర్టార్‌ విధులు నిర్వహిస్తున్నారు.

మార్కాపురంలోని భూమికి పశ్చిమ గోదావరిలోని ఓ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ జరిగింది. ఇతర జిల్లాలకు చెందిన వారే సదరు భూమిని కొనుగోలు చేసినట్టు ఈ జిల్లాకు వచ్చి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. వాస్తవానికి మార్కాపురం సబ్‌ రిజిస్ర్టార్‌ మాత్రం అడంగళ్‌లో వేరొకరి పేరుందంటూ రిమార్క్‌ రాశారు. అయినా సిఫారసులు అధికం కావడంతో రిజిస్ర్టేషన్‌ చేసేశారు. దీనిపై ఇప్పుడు రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అసలు యజమానులు ఇప్పుడు తెరపైకి వచ్చారు. దీనిపై విచారణకు జిల్లా రిజిస్ర్టార్‌ ఆదేశాలు జారీచేశారు.

మొగల్తూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కృష్ణా జిల్లా కృత్తివెన్నుకు చెందిన ప్రైవేటు భూములను గతంలో రిజిస్ర్టేషన్‌ చేశారు. దీనిపై అసలు యజమాని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగడంతో విచారణ చేపట్టారు. సబ్‌ రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకున్నారు. మొగల్తూరులో ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌లు అధికంగా జరుగుతుండడంతో అక్కడ విధులు నిర్వర్తించే సబ్‌ రిజిస్ర్టార్లు వరుసగా సస్పెన్షన్‌కు గురయ్యారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

ఎనీ వేర్‌ రిజిస్ర్టేషన్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఇటువంటి దందాలు అధికంగా ఉంటు న్నాయి. రాజకీయ నేతలు లేదా పైఅధికారుల నుంచి సిఫారసులు వస్తున్నాయి. దస్తావేజులో కొద్దిపాటి సవరణలకు ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ నిబం ధనను వినియోగించుకుంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అధికా రులు రిజిస్ర్టేషన్‌ చేసిన సందర్భాలు ఉంటున్నా యి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నాయి. ప్రభుత్వ భూములకు సరిహద్దులను అవే చూపిస్తూ వేరే సర్వే నంబర్ల తో రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. అక్కడ డోర్‌ నంబర్లు వేసి రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. జిల్లాలో ఇలాంటి కేసులు రిజిస్ర్టేషన్‌ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకే కుటుంబంలోనూ, బంధువుల మఽధ్య వివాదం వున్న భూములపైనా సబ్‌ రిజి స్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు జరుగుతు న్నాయి. చివరకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. వీటిపై సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల సిబ్బంది కలెక్టరేట్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఉద్దేశం మంచిదే..

అమ్మకందారులు, కొనుగోలుదారులకు వెసులుబాటు ఎక్కడ ఉంటే సదరు సబ్‌ రిజి స్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అక్రమ రిజిస్ర్టేషన్లు అరికట్టడానికి ఇరువర్గాల వేలిముద్ర లు వేసే నిబంధనలను అమలుచేస్తోంది. రెవె న్యూ అడంగళ్‌లో పేరున్న వ్యక్తి అమ్మకం చేస్తేనే రిజిస్ర్టేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వెబ్‌ల్యాండ్‌లో భూయజమాని పేరు తప్పనిసరిగా ఉండాలి. అవసరమైతే సబ్‌ రిజిస్ర్టార్‌లు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. ఒక ప్రాంతంలోని స్థలాలు, వ్యవసాయ భూములు, నివాసాలు ఎనీ వేర్‌ రిజిస్ర్టేషన్‌లో వేరొక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో రిజిస్ర్టేషన్లు నిర్వహిస్తు న్నారు. క్రయ, విక్రయదారులకు వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎనీవేర్‌ నిబంధ నను అమలుచేస్తోంది. స్థానికంగా సబ్‌ రిజిస్ర్టార్లు ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెట్టినా వేరొక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో కొనుగోలు, అమ్మకందారులకు ఊరట లభిస్తోంది. అదే క్రమంలో అక్రమ రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. భూమి లేదా స్థలం ఉండే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యంలో ఎటువంటి రిమార్క్‌లు లేకపోతేనే రిజిస్ర్టేషన్‌లు చేయాలి. అయినా సరే రిమార్క్‌ల ను పక్కన పెడుతున్నారు. దీనివల్ల అసలు భూయజమానులు నష్టపోతున్నారు. భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుసుకొని ఫిర్యాదులు చేస్తున్నారు. విచారణ జరిపిన తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లేదంటే బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాకు రెగ్యులర్‌ జిల్లా రిజిస్ర్టార్‌ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆయన వుంటే నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే విచారణలు వేగవంతంగా పూర్తిచేస్తారు. ప్రస్తుతం ఇతర జిల్లాల అధికారులకు ఇక్కడ ఇన్‌చార్జ్‌ భాధ్యతలు అప్పగిస్తున్నారు.

Updated Date - Aug 15 , 2026 | 01:22 AM