రైతన్నల సంక్షేమమే ధ్యేయం : మంత్రి కొలుసు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:30 AM
రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చెక్కపల్లిలో అన్నదాత సుఖీ భవ–పీఎం కిసాన్ మూడో విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది.
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడతగా రూ 89.85 కోట్లు విడుదల
ముసునూరు, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి): రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చెక్కపల్లిలో అన్నదాత సుఖీ భవ–పీఎం కిసాన్ మూడో విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77కోట్లు, ముసు నూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు నమూనా చెక్కులను కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి మంత్రి అందజేశారు.అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడో విడతగా రూ.89.85 కోట్లు విడు దలతో 1,60,968 మంది రైతులకు లబ్ధి చేకూరింద న్నారు. త్వరలో చింతల పూడి ఎత్తిపోతల పనుల ను మొదలు పెడతామ న్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను కలెక్టర్‌తో కలిసి ఆయన సందర్శించారు. సబ్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఉద్యానవన అధికారి షాజా నాయక్, ఎంఐపీ పీడీ రామ్మోహన్, సర్పంచ్ రాధిక, ఎంపీపీ దుర్గాభవాని, ఎంపీటీసీ కె.పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.