రైతుల మోములో విరిసిన ఆనందం
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:35 AM
ఎల్‌నినో ప్రభావం, అర్నబ్ తుఫాన్ ప్రభావం కారణంగా అన్నదాతలు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల కావడంతో వారికి కొంత చేయూత నిచ్చినట్లయింది.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల
1,60,968 మందికి రూ.105.69 కోట్లు విడుదల
ఏలూరుసిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం, అర్నబ్ తుఫాన్ ప్రభావం కారణంగా అన్నదాతలు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల కావడంతో వారికి కొంత చేయూత నిచ్చినట్లయింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా అన్నదాత సుఖీభవ, 24 విడతగా పీఎం కిసాన్ నిధులు విడుదల కావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాకు సంబంధించి 1,60,968 మందికి మొత్తం రూ.105.69కోట్లు నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడు దల చేశాయి. ఇందులో అన్నదాత సుఖీభవ నిధులు రూ.80.48 కోట్లు, పీఎం కిసాన్ నిధు లు రూ.25.21 కోట్లు ఉన్నాయి. చాలామందికి శుక్రవారమే ఈ నిధులు బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని, సాంకేతిక ఇబ్బందులుంటే జమ కొంత ఆలశ్యమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.