Share News

వేల్పూరులో అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - May 03 , 2026 | 11:38 PM

వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ–కృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వేల్పూరులో అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠ
విగ్రహ ప్రతిష్ఠలో మంత్రి దుర్గేశ్‌, ఆరిమిల్లి పూజలు

తణుకు రూరల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ–కృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, గోపూజ, ఆంజనేయ హోమాల వంటి కార్యక్రమాలు నిర్వహిం చారు. 504 మంది భక్తులతో హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. అనంతరం అఖండ అన్నసమారాధనలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్ర మాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబసభ్యులతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు బడేటి వెంకట్రామయ్య, చింతమనేని ప్రభాకర్‌, మద్దిపాటి వెంకట్రాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీలు బొర్రా గోపి మూర్తి, పేరాబత్తుల రాజశేఖర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు, ఏపీఐఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, పారిశ్రామికవేత్త డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌, కలెక్టర్‌ నాగరాణి, జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, పలు కార్పొరేషన్‌లు, సంఘాల చైర్మన్‌లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:38 PM