Share News

మరో పోరాటం తప్పదు

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:33 AM

కూటమి ప్రభుత్వం వచ్చి రెండే ళ్లయినా వేతనం పెంచ లేదని మరోపక్క పనిభారం పెంచారని వేతనం పెంచక పోతే మరో పోరాటం తప్పదని అంగన్వాడీలు హెచ్చరించారు.

మరో పోరాటం తప్పదు
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ఆందోళన

భీమవరం టౌన్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చి రెండే ళ్లయినా వేతనం పెంచ లేదని మరోపక్క పనిభారం పెంచారని వేతనం పెంచక పోతే మరో పోరాటం తప్పదని అంగన్వాడీలు హెచ్చరించారు. కోర్కెల దినం పేరుతో శుక్రవారం అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు.యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఝాన్సీలక్ష్మి, కళ్యాణి మాట్లాడుతూ పని ఒత్తిడి తగ్గిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం నవచేతన యాప్‌, సర్‌ సర్వే డ్యూటీలు చేయిస్తూ పని ఒత్తిడి పెంచిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు వరకు ప్రదర్శన నిర్వహించి గేటు ఎదుట బైఠాయించారు. డీఆర్వోకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా నాయకులు అంగన్వాడీ నాయకులు హసీనా, తులసి, మహాలక్ష్మి, నాగరత్నం, ఉషారాణి, విజయలక్ష్మి, రామకోటి, శ్యామల, దీనస్వరూప పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:33 AM