Share News

అంగన్‌వాడీల ఆగ్రహం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:14 AM

ప్రభు త్వం తమను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతి రేకిస్తూ ఏలూరులో అంగన్‌వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్‌ వద్ద బైఠాయించారు.

అంగన్‌వాడీల ఆగ్రహం
ఉమ్మడి జిల్లాలో నిరసనలు

విజయవాడ ధర్నాలో అక్రమంగా అరెస్టు చేశారంటూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు

పోలీస్‌ స్టేషన్‌లకు తరలించిన కార్యకర్తల విడుదల .. వారి స్వస్థలాలకు తరలింపు

ఏలూరు రూరల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం తమను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతి రేకిస్తూ ఏలూరులో అంగన్‌వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి టి. మాణిక్యం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్‌వాడీలపై దౌర్జన్యకాండకు పాల్ప డ్డారని, విజయవాడలో అరెస్టు చేసి ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి తరలించడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అంగన్‌వాడీల ఆందోళనకు ఉద్యోగ, ఉపాఽధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షుడు ఎ. రవి మద్దతు పలికారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణా రావు, జిల్లా అధ్యక్షుడు ఎర్రా రాంబాబు, ఆర్‌టీసీఎస్‌ డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ సుందరయ్య, సీఐటీయూ నాయకులు ఎం. ఇస్సాక్‌, పంపన రవికుమార్‌ నాయకత్వం వహించారు.

భీమవరంలో నిరసన

భీమవరంటౌన్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి):మహిళలని కూడా చూడకుండా విజయవాడలో నిరసన తెలుపు తున్న అంగన్‌వాడీలను అరెస్టు చేయడం దుర్మార్గమని, అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ గోపి మూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు భీమవరం ప్రకాశం చౌక్‌లో ఆందోళన చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను సుదూర ప్రాంతాలకు తీసుకుపోయి పోలీస్‌ స్టేషన్‌ల్లో నిర్బంధించడం దుర్మార్గ మైన చర్యన్నారు. ఇప్పటి పాలకులు గతంలో 42 రోజుల సమ్మెలో అంగన్‌వాడీల ప్రతి టెంట్‌ వద్దకు వెళ్లి తాము అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేదన్నా రు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవ రావు, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ స్టేషన్లకు తరలింపు

పెదపాడు: విజయవాడ ధర్నాలో పాల్గొన్న అంగన్‌ వాడీ కార్యకర్తలు, ఆయాల్లో 28 మందిని మంగళవారం పెదపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయంలో విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశామని పెదపాడు ఎస్సై ఆర్‌.శ్రీను తెలిపారు. అనంతరం పెదవేగి సీఐ రాజశేఖర్‌ అంగన్‌వాడీ కార్య కర్తలకు పోలీసు చట్టాలపై వివరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వాహనాల్లో స్వస్థలాలకు పంపారు.

చాట్రాయి: విజయవాడ ఽధర్నాలో పాల్గొన్న కోనసీమ జిల్లా అంగన్వాడీ కార్యకర్తలను పొలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని చాట్రాయి జడ్పీ హైస్కూల్‌కి తరలించారు. ఇక్కడ పోలీసులు వీరికి భోజన సదుపాయాలు కల్పించి, అనంతరం కోనసీమ జిల్లాలోని స్వస్థలాలకు పంపారు. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.

గణపవరం: విజయవాడ ధర్నాలో పాల్గొన్న అం గన్వాడీలను సుమారు 20 మందిని అరెస్టు చేసి గణప వరం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని, వారిని వెంటనే విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం హామీలు అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ గణపవరం సెంటర్‌లో అంగన్వాడీలు మానవహారం నిర్మించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. నిడమర్రు సీఐ రజనీ కుమార్‌, ఎస్సైలు ఏ.మణి కుమార్‌, రమేశ్‌ నిరసనకారులతో చర్చించిన అనంతరం నిర్బంధించిన అంగన్వాడీలను విడుదల చేశారు. సీఐటీయూ నాయకులు ఝాన్సీ, రామకోటి, ఎం.పెంటా రావు, కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం చిననాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:14 AM