Share News

వంట తంటాలకు..చెక్‌!

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:44 AM

ఇరాన్‌– అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశంలో గ్యాస్‌ సంక్షోభం తలెత్తడంతో పాటు గ్యాస్‌ ధరలు భారంగా మారాయి. దీంతో అంగన్‌వాడీల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు వంటకు ఇక్కట్లు లేకుండా ఇండ క్షన్‌ స్టౌలను అందించాలని ఇటీవల నిర్ణయించగా ప్రభు త్వం సత్వరం వాటిని కొని ఐసీడీఎస్‌ శాఖకు అందిం చింది.

వంట తంటాలకు..చెక్‌!
అంగన్‌వాడీలకు ఇండక్షన్‌ స్టౌలను అందజేస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టౌలు

తొలగనున్న గ్యాస్‌ కష్టాలు

కొత్తగా 1,811 సెంటర్లకు పంపిణీ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఇరాన్‌– అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశంలో గ్యాస్‌ సంక్షోభం తలెత్తడంతో పాటు గ్యాస్‌ ధరలు భారంగా మారాయి. దీంతో అంగన్‌వాడీల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు వంటకు ఇక్కట్లు లేకుండా ఇండ క్షన్‌ స్టౌలను అందించాలని ఇటీవల నిర్ణయించగా ప్రభు త్వం సత్వరం వాటిని కొని ఐసీడీఎస్‌ శాఖకు అందిం చింది. కేంద్రసాయంతో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్యాస్‌ కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోనూ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇండక్షన్‌ స్టౌలపైనే ఆయాలు వంటలు చేయనున్నారు. సులభంగా, సునాయాసంగా వంటలను చేయగలుగుతున్నామని ఇప్పటికే స్టౌలు అందించిన అర్బన్‌ ప్రాంత అంగన్‌వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇండక్షన్‌ స్టౌలను జిల్లాలో గతేడాది సెప్టెంబరులో అర్బన్‌ ప్రాంతాల్లో అందజేశారు. జిల్లాలో 2,155 మెయిన్‌, 71 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో మొత్తం మూడు అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 405 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టౌలను గతంలో అంద జేసింది. ప్రధానంగా ఏలూరు అర్బన్‌ పరిధిలోని 205 అంగన్‌వాడీ కేంద్రాలకు 205, జంగా రెడ్డిగూడెంలో 83 సెంటర్లకు, నూజివీడులో 117 సెంటర్లకు ఇండక్షన్‌ స్టౌలను అందజేసింది. కాగా వీటితో పాటు వంటలు చేసుకునేందుకు వీలుగా రూ.ఏడువేల విలువైన సురక్షితమైన వంట పాత్రలను అందజేసింది. దీంతో వంటలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా సకాలంలో సునాయాసంగా అందించి వండించి వండి పెడుతున్నారు. ఇప్పుడు జిల్లాకు వచ్చిన 1,811 ఇండక్షన్‌ స్టౌలతో అన్ని కేంద్రాలకు ఇండక్షన్‌ స్టౌలు సమకూరినట్లే.

గ్యాస్‌ సిలెండర్‌ రిజర్వ్‌లో...

అత్యవసరమై, విద్యుత్‌ కోతల సమయాలో గ్యాస్‌ సిలిండర్లపై వంటలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి అర్బన్‌ ప్రాజెక్టుల్లో పాత సిలిండర్లు ఉన్న వాటిని ఉపయోగించిన దాఖల్లా లేకుండానే వంటలు చేస్తున్నారు. దశలవారీగా గ్యాస్‌ సిలిండర్లు వినియోగాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా కొన్ని పెద్ద సెంటర్లలో గ్యాస్‌ సిలిండర్లను రిజర్వ్‌లో ఉంచే అవకాశం ఉంది.

ఇండక్షన్‌ స్టౌలు పంపిణీ

పెదపాడు : సకాలంలో, సురక్షితమైన పౌష్టికాహారాన్ని తయారుచేసి అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణులు, బాలిం తలకు అందజేసేందుకు ఇండక్షన్‌ స్టవ్‌లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటా యని కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. వట్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లకు ఇండక్షన్‌ స్టవ్‌లను సోమవారం పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ హితమైన, పొగలేని వంటగదుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని అన్ని కేంద్రాలకు వీటిని అందిస్తున్నామన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 01:44 AM