శ్రీవారి ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:44 AM
శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం కనిపించింది. చినవెంకన్న ఆలయానికి ప్రతీరోజు వందలు, వేలాదిగా తరలివచ్చే భక్తులు మంగళవారం అందులోనూ అమావాస్య వచ్చిన కారణంగా తక్కువ సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు.
ద్వారకాతిరుమల, జూలై 14 (ఆంధ్ర జ్యోతి): శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం కనిపించింది. చినవెంకన్న ఆలయానికి ప్రతీరోజు వందలు, వేలాదిగా తరలివచ్చే భక్తులు మంగళవారం అందులోనూ అమావాస్య వచ్చిన కారణంగా తక్కువ సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఆలయంలోని అన్ని విభాగాలు సాధారణ భక్తుల రద్దీ కూడా కానరాలేదు.. ఆలయానికి వచ్చిన కొద్దిమంది యాత్రి కులు క్యూలైన్లలో వెళ్లి స్వామి, అమ్మవా ర్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకు న్నారు. క్షేత్రపరిసరాలు, గ్రామ ప్రధాన రహదారి దాదాపు ఖాళీగా కన్పించాయి.