Share News

అంతా అప్రమత్తం

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:23 AM

ఏలూరు జిల్లాలో ఓ వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావ డంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

అంతా అప్రమత్తం
కరోనా సోకిన వృద్ధురాలి ఇంటి వద్ద శానిటేషన్‌

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో ఐసోలేషన్‌ వార్డు సిద్ధం

కొవిడ్‌ పరీక్షలకు మార్గం సుగమం..

ఆగిరిపల్లిలో వృద్ధురాలి కుటుంబ సభ్యుల నుంచి శ్వాబ్‌ల సేకరణ

ఏలూరు అర్బన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాలో ఓ వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావ డంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆగిరిపల్లికి చెందిన వృద్ధురాలు కొవిడ్‌తో మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, అనుమానిత లక్షణాలతో ఇంకెవరైనా ఉన్నారేమోనన్న నిర్ధారణ కోసం ఆమె కుటుంబ సభ్యుల్లో ముగ్గురి నుంచి శ్వాబ్‌ నమూ నాలను శనివారం సేకరిం చి పరీక్షల నిమిత్తం విజయ వాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌ రిపోర్టు సోమవారం వస్తుందని వైద్య వర్గాలు తెలిపా యి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ లకు జలుబు, జ్వరం, దగ్గు, తదితర లక్షణాలతో వచ్చే రోగుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే కొవిడ్‌ పరీ క్షలు చేయాలని, అవసరమైతే ఏలూరులోని ప్రభుత్వాసు పత్రికి రిఫర్‌ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శోభ ఆదేశించారు. కొవిడ్‌ రోగుల కోసం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పది పడకలతో ఐసోలేషన్‌ వార్డు ను ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్లతో కొనసాగిస్తున్నట్టు ఇన్‌చార్జి సూపరింటెం డెంట్‌ తెలిపారు. ప్రస్తుతం కొత్తగా విస్తరి స్తున్న కొవిడ్‌ వేరియంట్‌ ప్రభావంతంగా లేనందున భయపడాల్సిన పనిలేదని వైద్యవర్గాలు వివరించాయి.

రేపటి నుంచి ల్యాబ్‌ పునఃప్రారంభం

గత ఆగస్టు నుంచి మూతపడిన ఏలూరు ప్రభుత్వా సుపత్రి ప్రాంగణంలోని ఆర్టీపీసీఆర్‌/వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాబ్‌ను 11 నెలలుగా మూసివేయడంపై ‘కొవిడ్‌ కలకలం’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారి నుంచి సేకరించిన శ్వాబ్‌ నమూనాలను కచ్చితమైన పరీక్షల కోసం వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో మాత్రమే చేయాలి. సోమవారం నుంచి ఏలూరు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను తెరవడానికి వైద్య ఆరోగ్య శాఖ, డీఎంఈ చర్యలు చేపడుతున్నా రోగుల నుంచి సేకరించే శాంపిల్స్‌ను కచ్ఛితమైన ఫలితం కోసం ల్యాబ్‌ టెక్నీషియన్లను వినియోగిస్తే వారికి తగిన అనుభవం లేక ఫలితంపై ప్రభావం చూపవచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Jul 19 , 2026 | 12:23 AM