రక్తహీనతకు చెక్ పెడదాం..
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:22 AM
ఎక్కువగా నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఉంటుంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో చేతి వేళ్ల ద్వారా క్రిములు మనం తినే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి.
రక్తహీనతకు చెక్ పెడదాం..
ఫ నులిపురుగుల నివారణకు చర్యలు అవసరం
ఫ నేడు చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీల
పాలకోడేరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎక్కువగా నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఉంటుంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో చేతి వేళ్ల ద్వారా క్రిములు మనం తినే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. ఇవి రక్త హీనతను కలగజేస్తాయి. నులిపురుగులను శుభ్రతతో పాటు ఆకుకూరలు, కాయ గూరలు, పండ్లు శుభ్రం చేసుకుని తినడం, చేతులను శుభ్రంగా ఉంచడం ద్వారా నివారించవచ్చు. ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందించే నులిపురుగుల నివారణ మాత్రలతో రక్తహీనత నుంచి పిల్లలను కాపాడవచ్చు. ఇందులో భాగంగానే సోమవారం ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
అంగన్‌వాడీ స్థాయి నుంచి పంపిణీ..
ఏడాది నుంచి 19 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ సోమవారం మా త్రలు పంపిణీ జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు. రక్త హీనత నివారణకు ప్రభు త్వాలు ఏడాదిలో రెండు పర్యాయాలు అల్బెండాజోల్ (నులిపురుగుల నివారణ మాత్రలు)వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తుంటారు. మొదటి విడతగా గత ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. రెండవ విడతగా ఆగస్టులో అందించాల్సి ఉండగా సోమవారం అంగన్‌వాడీ నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అం దరికీ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం గైర్హాజరైన విద్యార్థులకు మలివిడతగా అక్టోబరు 5వ తేదీన మాత్రలు పంపిణీ చేయనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3.49 లక్షల మంది..
20 మండలాలు, 6 అర్బన్ ప్రాంతాలలో 3,49,301 మంది విద్యార్థులకు, కిషోర్ బాలబాలికలకు అల్బెండాజోల్ మాత్రలు అందించనున్నట్టు డీఎంఎండ్ హెచ్‌వో సి.హెచ్. వి.భారతీలక్ష్మీ, ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి కేఎంఆర్ కిషోర్‌లు తెలిపారు. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు 1611, గవర్నమెంట్, ఎయిడెడ్ పాఠశాలలు 1389, గవర్నమెంట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు 31, ప్రయివేటు జూనియర్ కాలేజీలు 70, సాంకేతిక కళాశాలలు 17, ఒకేషనల్ కళాశాలలు 4, నర్సింగ్ కళాశాలలు 7, డిగ్రీ ఫస్టియర్ కళాశాలలు 21, పారా మెడికల్, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు 16, ఉన్నాయి. ఆయా అంగన్‌వాడీలు, స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న వారితో పాటు బడి బయట ఉన్న కిశోర బాలబాలికలకు కూడా ఈ మాత్రలను అందించనున్నారు.
ఏలూరు జిల్లాలో 3.88 లక్షల మంది..
ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో 3,88,955 మందికి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత మాత్రలను నమిలిమింగించి నీటిని తాగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ శోభ సూచించారు. ఏదైనా అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాదులున్నవారికి మాత్రలను ఇవ్వరాదని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 69,227మంది చిన్నారులకు, ఒకటి నుంచి టెన్త్ వరకు చదువుతున్న 2,62,006 మంది విద్యార్థులకు, కళాశాలలకు చెందిన 55,961మంది విద్యార్థులకు, పాఠశాల/కళాశాలకు వెళ్ళని 1761 మందికి ఆల్బెండాజోల్ మాత్రలను ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడాదినుంచి రెండేళ్లు వయసు గల చిన్నారులకు సగం మాత్రను పొడిగాచేసి నీటిలో కలిపి తాగించనున్నట్టు వైద్యులు తెలిపారు.