భక్తజన సంద్రంగా.. అలంపురం
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:15 AM
అల ంపురం శ్రీ వెంకటరమణా సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెదృకృష్ణంరాజు నూ తనంగా నిర్మాణాలు చేస్తున్న 5 ఎకరాల ప్రాం గణం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది.
భక్తజన సంద్రంగా.. అలంపురం
వైభవంగా భూశాంతి మహాయజ్ఞం
పెంటపాడు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి) : అల ంపురం శ్రీ వెంకటరమణా సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెదృకృష్ణంరాజు నూ తనంగా నిర్మాణాలు చేస్తున్న 5 ఎకరాల ప్రాం గణం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ ప్రాంగణం మొత్తంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్త జనంతో నిండిపోయింది. నూతనంగా నిర్మాణం చేస్తున్న 100 పడకల ఆసుపత్రి, వృద్ధులకు ఆనంద నిలయం, యాత్రికుల కోసం సేవాసదనం, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆకృతిలో భారీ వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఆదివారం ప్రాంగణం వద్ద సాధు, గో, అశ్వ, గజ, సహిత భూ శాంతి మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. చుట్టు పక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలి వచ్చారు.
ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు
భక్తులకు ప్రాంగణ ముఖద్వారం వద్ద ఏర్పా టు చేసిన సుస్వాగతం హాట్స్ అందరిని అక ట్టుకుంది. లోపలకు వెళ్ళగానే వెంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో కాశీలో ఉండే విధంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం నుంచి సాయం త్రం వరకు హోమ పూజలు సాగాయి.
65 మంది పీఠాధిపతులు
ప్రాంగణంలోకి వివిధ ప్రాంతాల నుంచి 65 మంది పీఠాధిపతులు కార్యక్రమానికి హాజర య్యారు. పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో భక్తులు పులకించిపోయారు. ఐదు ఎకరాల ప్రాంగణం మొత్తం జై శ్రీరాం అంటూ శ్రీరామ నామస్మరణతో మారు మ్రోగి పోయింది. డబ్బు చాలా మంది వద్ద ఉంటుందని పేదల కోసం ఇన్ని సేవలు చేస్తున్న కొలనువాడ పెదకృష్ణం రాజు సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పీఠాధిపతులు అన్నారు. భవిష్య త్‌లో ఈ ప్రాంగణం వైద్య సేవలతో పాటు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందంటూ ఆశ్వీరది ంచారు.
ప్రత్యేక ఆకర్షణగా రామబాణం
ఆయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని స్వర్ణ రామబాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ బాణాన్ని దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. రామబాణం కింద శ్రీరాముని పాద ముద్రికలను ఉంచి వాటిని భక్తులు చేతులతో తాకి నమస్కరించుకునేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 1200 మంది కళాకారులతో నిర్వహి ంచిన కోలాట ప్రదర్శన ఆకట్టు కునేలా చేసింది.
ప్రజా సేవకు జీవితం అంకితం
ప్రజా సేవకే తన జీవితం అంకితమని ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెదకృష్ణంరాజు తెలిపారు. ఈ ప్రాజక్టు తన 15 సంవత్సరాల కల అన్నారు. దీనికోసం ఎవరిని ఆశించకుండా తన ఆస్తిలో 40 ఎకరాలు ట్రస్టు పేరున రాయడంతో పాటు తన సంపాదన 50 శాతం సేవకే వెచ్చిస్తున్నాన న్నారు.