రేవతి రామ్‌కుమార్‌కు అక్కినేని సంగీత పురస్కారం
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:47 PM
తెలుగు చలన చిత్ర రంగానికి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సమాజానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కొడాలి వెంకటేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీ యమని పలువురు వక్తలు కొనియాడారు.
ఏలూరు రూరల్, నవంబరు 11(ఆంధ్ర జ్యోతి) : తెలుగు చలన చిత్ర రంగానికి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సమాజానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కొడాలి వెంకటేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీ యమని పలువురు వక్తలు కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొడాలి వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఏలూ రు రామకృష్ణాపురంలో సాహిత్య మండలి, గరికిపాటి ఆర్ట్స్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏలూరులోని పుల్లాభొట్ల శ్రీరామమూర్తి ప్రాగణంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కళారత్న ఎస్‌వీ రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉషా పిక్చర్స్ అధినేత వీవీ బాలకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి జీవిత విశేషాలను, కళా, సామాజిక రంగాలకు చేసిన కృషిని పలువురు వక్తలు కొనియాడారు. అనంతరం ప్రముఖ గాయని విష్ణువజుల రేవతి రామ్‌కుమార్‌కు అక్కినేని సంగీత పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, ప్రముఖులు, అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.