రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలే లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 12:50 AM
‘దశల వారీ గా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా దృష్టి పెట్టా’మని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు.
భీమడోలు, మే 22(ఆంధ్రజ్యోతి):‘దశల వారీ గా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా దృష్టి పెట్టా’మని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. నిడమర్రు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రెండో విడత ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటన లలో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు పాల్గొని ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ‘అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలి. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటా’మన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ నియోజక వర్గంలోని సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇన్‌చార్జి ఆర్డీవో కిషోర్, నియోజక వర్గ ప్రత్యేకాధికారి, ఉద్యానవనశాఖ అధికారి షాజా నాయక్, ఎంపీపీ ధనికొండ ఆదిలక్ష్మి, వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.