Share News

రైతులకు ప్రోత్సాహమేదీ..?

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:04 AM

జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారం భమయ్యాయి.

రైతులకు ప్రోత్సాహమేదీ..?
సభలో మాట్లాడుతున్న అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌.. వేదికపై రైతు సంఘాల, వామపక్షాల నాయకులు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వ్యవసాయ రంగానికి తీరని నష్టం

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌

ఏలూరు కార్పొరేషన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిం చడం లేదు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణమ వుతోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వ్యవసాయ రంగానికి తీరని నష్ట’మని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారం భమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రైతాంగాన్ని ఆదుకోవా లంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత కిసాన్‌ సభ జాతీ య ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ మాట్లాడుతూ ‘అమెరికాలో ఒక్కొక్క రైతుకు ఏడాదికి రూ.32 లక్షలు రాయితీలు ఇస్తుంటే భారతదేశంలో వ్యవసాయాన్ని దండగ పనిగా మార్చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో పది లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూమి పై పనిచేస్తూ పంటను పండిస్తున్న ఏపీలో 30 లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రాయితీ అందడం లేదు. అమెరికా కార్పొరేట్‌ వ్యవసాయ విధానాలను మన దేశంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతోంది. ఏపీలో చంద్రబాబు, జగన్మో హన్‌రెడ్డిలు నోరెత్తకుండా భజనపరులుగా మారిపో యారు. ప్రజలకు ప్రత్యక్షంగా మోదీ చట్టాలకు వంత పాడుతుంటే జగన్మోహన్‌రెడ్డి మౌనం వహిస్తు’న్నార న్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో గోదావరి జిల్లాల్లో సాగునీటితో పాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలఏరులా పారుతోందన్నారు. గోదావరి జిల్లాలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే కరువు జిల్లాలు, వెనుకబడిన జిల్లా ల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవ చ్చన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నాలుగు వేల కోట్ల రూపాయలకు కేటాయిస్తే ప్రాజెక్టు అయిపోతుందని అన్నారు. ఉచిత పంటల బీమా లేక రైతులు నష్టపో తున్నారన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్‌, రాష్ట్ర సీనియర్‌ వై.కేశవరావు, మంతెన సీతారాం, ఎం.సూర్యనారాయణ, కె.శ్రీని వాస్‌, ఆర్‌.లింగరాజు, ఎం.నాగ మణి, పి.రామకృష్ణ, తెల్లం రామకృష్ణ, కట్టా భాస్కరరావు, ఎస్‌.సీతారామయ్య, కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు పాల్గొన్నారు. 4, 5 తేదీల్లో డీసీఎంఎస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు కొనసాగుతాయని కె.శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 01:04 AM