అగ్రి గోల్డ్ బాధితులు ఈ తేదీల్లో రావాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:27 AM
అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ బాండ్ల కలర్ జిరాక్స్‌లు, ఇతర ధ్రువపత్రాలను సీఐడీ అధికారులకు అందజేసే కార్యక్ర మం కొద్ది రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో పెదపాడు మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయ సమీ పంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్‌కు హాజరై అక్కడ ఉన్న సీఐడీ అధికారులకు తమ వద్ద ధ్రువపత్రాలు అందజేయాలని అధికారులు తెలిపారు.
అగ్రి గోల్డ్ బాధితులు ఈ తేదీల్లో రావాలి
సంబంధిత పత్రాలు ఉండాలంటూ అధికారుల సూచన
ఏలూరు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి):అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ బాండ్ల కలర్ జిరాక్స్‌లు, ఇతర ధ్రువపత్రాలను సీఐడీ అధికారులకు అందజేసే కార్యక్ర మం కొద్ది రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో పెదపాడు మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయ సమీ పంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్‌కు హాజరై అక్కడ ఉన్న సీఐడీ అధికారులకు తమ వద్ద ధ్రువపత్రాలు అందజేయాలని అధికారులు తెలిపారు. 28, 29 తేదీల్లో కొయ్యలగూడెం మండలం, 30, 31 తేదీల్లో లింగపాలెం మండలాల అగ్రిగోల్డ్ బాధితులు హాజరవ్వాలని సీఐడీ అధికారులు సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులు వచ్చేటప్పుడు ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్, కలర్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్క్ మొదటి పేజీ జిరాక్స్, ఆధార్‌కాని, ఓటరు గుర్తింపు కాని, రేషన్‌కార్డు జిరాక్స్, పాన్‌కార్డు జిరాక్స్, డిపాజిట్ దారులు మరణిస్తే వారి నామినీ ఐడీ ఫ్రూఫ్, డిపా జిట్‌దారుని మరణ ధృవపత్రం, బంధువులు అయితే ఫ్యామిలీ సర్టిఫికెట్, డిపా జిట్ దారుడు లేవలేని స్ధితిలో ఆధరైజేషన్ ధృవపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటో ఒకటి తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సీఐడీ అధికారి సెల్ నెంబర్ 92475 97968ను సంప్రదించాలని సూచించారు.