వ్యవసాయంలో కోత !
ABN , Publish Date - May 06 , 2026 | 12:22 AM
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. సబ్సిడీపై రైతులకు యంత్రాలు అందిస్తోంది. ఈ ఏడాది 2.80 కోట్లు మంజూరు చేసింది.. అయితే గతేడాదితో పోలిస్తే తగ్గింది.
రాయితీతో యంత్ర పరికరాలు
గతేడాది కంటే తగ్గిన బడ్జెట్
జిల్లాకు 2.80 కోట్ల నిధులు
ఈ క్రాప్ నమోదు ఆధారంగా కేటాయింపు
పరికరాల కోసం సిఫారసులు
నేతల చుట్టూ నాయకులు, రైతులు
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. సబ్సిడీపై రైతులకు యంత్రాలు అందిస్తోంది. ఈ ఏడాది 2.80 కోట్లు మంజూరు చేసింది.. అయితే గతేడాదితో పోలిస్తే తగ్గింది. గత ప్రభుత్వం గ్రూపులకు పరికరాలు అందిస్తే ఇప్పుడు వ్యక్తిగతంగా అందిస్తోంది. దీంతో సిఫా రసులకు తెరలేచింది. వ్యవసాయ అధికారులకు రాజకీయ ఒత్తిడి తగులుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తోంది. ఈ–క్రాప్ నమోదు ఆధారంగా జిల్లాలకు రాయితీని కేటాయించారు.దాంతో జిల్లాకు మంజూరు చేసిన రాయితీలో కోత పడింది. గతేడాది దాదాపు రూ.4 కోట్లు మంజూరు చేశారు. ఈసారి రూ.2.80 కోట్లు కేటాయిం చింది. ప్రతి నియోజకవర్గానికి రూ. 36 లక్షల వంతున రాయితీని సర్దుబాటు చేశారు.ఆ మేరకు పరికరాలు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల నుంచి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటో వేటర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పనిముట్లు ఆశిస్తున్న రైతులంతా ఇప్పుడు కూటమి నేతల సిఫారసు కోసం ఎగబడు తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను కలుసుకుం టున్నారు. రాయితీతో పరికరాలు ఇప్పించాలని విన్నవించు కుంటున్నారు. వ్యవ సాయ శాఖ అధికారులకు సిఫారసుల సెగ తగులుతోంది. ప్రభుత్వం కేటా యించిన రాయితీ తక్కువగా ఉంది. మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రాయితీ ఇస్తున్నారు. బీసీలు, సన్న, చిన్న కారు రైతులకు 50 శాతం రాయితీలో ఉపకర ణాలను అందజేయ నున్నారు. ఇతరులకు 40 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వంలోనే వ్యక్తిగతంగా ఉపకరణాలను అంద జేస్తున్నారు. గత ప్రభుత్వంలో మండలాల వారీగా కస్టమ్ హైర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూపులకు రాయితీతో కూడిన పరికరాలు అందజేశారు. దీనివల్ల ఇతర రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. కొద్ది మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు. ఇప్పుడా రుణాలు చెల్లించడానికి ఆపసోపాలు పడు తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వ్యక్తిగతంగా రైతులకు రాయితీ పరికరాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంది.
సర్దుబాటు కోసం తంటాలు
ప్రభుత్వం కేటాయించిన రాయితీని నియోజకవర్గాల వారీగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం నియోజక వర్గస్థాయిలో ట్రాక్టర్లు, టిప్పర్లు, రోటో వేటర్లు ఇలా ఎన్ని యూనిట్‌లు ఇవ్వాలనే దానిపై వ్యవసాయ శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రైతులనుంచి వచ్చే డిమాండ్ మేరకు పంపిణీ చేయాలన్న తలంపుతో ఉన్నారు. జిల్లాలో వరిసాగు తగ్గుముఖం పట్టడంతో రాయితీ మంద గించింది. మరోవైపు వ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే ఇతర పంటలు కూడా జిల్లాలో లేవు. అపరాలు వేయడం లేదు. మొక్కజొన్న సాగుకు అనువైన భూములు కాదు. మరోవైపు ఆక్వా సాగు విస్తరిస్తోంది. ఫలితంగా వ్యవసాయ భూములు తగ్గిపోతు న్నాయి. దానివల్లే జిల్లాకు కోత పడిందని అంచనా వేస్తు న్నారు. గత ప్రభుత్వంతో పోల్చు కుంటే అత్యధిక మంది రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతీఏటా ఇదే తరహాలో మంజూరు చేస్తే కొంత మేర ఒత్తిడి తగ్గనుంది.
గతంలో గ్రూపులకే...
ప్రభుత్వాలు మారితే ప్రణాళికలు తారుమారవు తున్నాయి. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు వ్యక్తిగత రాయితీలు ఇవ్వలేదు. అతికొద్దిమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వాటిని కూడా రైతులకు కట్టబెట్టడానికి వ్యవసాయ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చింది. ఒక్కో గ్రూపునకు రూ. 15 లక్షలు వంతున అప్పట్లో రుణాలు కల్పించారు. అంతకు మంచి రుణాలు మంజూరు చేసి రాయితీ కల్పించారు. ప్రస్తుతం ఎక్కువమంది రైతులకు తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడంతో పాటు, రాయితీ ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు వ్యక్తిగతంగా మేలు చేకూరనుంది. ఎటొచ్చీ రాయితీ తగ్గిపోవడమే కాస్త ఆందోళన కలిగిస్తోంది.