Share News

రైతులకు వ్యవ‘సాయ’ పరికరాలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:31 AM

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రాయితీతో వ్యవసాయ పరికరాలు అందిం చేందుకు జిల్లాకు రూ.2.37 కోట్లు మంజూరు చేసింది.

రైతులకు వ్యవ‘సాయ’ పరికరాలు

రాయితీపై యంత్రాలు అందజేత

జిల్లాకు రూ. 2.37 కోట్లు మంజూరు

రైతులకు 50 శాతం రాయితీ ...పెద్ద రైతులకు 40 శాతం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రాయితీతో వ్యవసాయ పరికరాలు అందిం చేందుకు జిల్లాకు రూ.2.37 కోట్లు మంజూరు చేసింది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి జిల్లాకు తక్కువగానే నిధులు కేటా యించింది. వరి,ఉద్యాన సాగులను పరిగణలోకి తీసుకుంది. జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉంది. ఆక్వా సాగు విస్తరించడంతో వరి సాగు కూడా తగ్గుముఖం పట్టింది. ఉద్యాన సాగు అంతగా లేదు. ఫలితంగా ఈ సారి నిధులు మంజూరు తక్కువైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతుల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చినట్టయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వ్యవసాయ పరికరాలను అందజేయనున్నారు. వరి రైతులు వినియోగించుకునే విధంగా 40 హెచ్‌పీలోపు ఉండే ట్రాక్టర్‌లు, పవర్‌ టిల్లర్లు, వరికోత యంత్రాలు, స్ర్పేయర్‌లు తదితర పరికరాలను అందజేయాలని ప్రభుత్వం సూచించింది. మహిళా, సన్న, చిన్న కారు, ఎస్టీ, ఎస్టీ, బీసీ రైతులకు 50 శాతం రాయితీతో పరికరాలను పంపిణీ చేయ నున్నారు. మిగిలిన రైతులకు 40 శాతం రాయితీ కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.112 కోట్లు రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ లెక్కన జిల్లాకు తక్కువగానే నిధులు కేటాయించారు. వరి, ఉద్యాన సాగులను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాయితీ నిధుల్లో కోత పడింది.

Updated Date - Apr 09 , 2026 | 12:32 AM