Share News

ఆ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తాం

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:30 AM

ముదినేపల్లి కేంద్రంగా జరుగుతున్న మోటారు వాహనాల నకిలీ ఇంజన్‌ ఆయిల్స్‌ తయారీపై పూర్తిస్థాయి విచారణ జరిపి యూరియా ఎరువును సరఫరా చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లను

ఆ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తాం
నకిలీ ఇంజన్‌ ఆయిల్స్‌ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ హబీబ్‌ బాషా

నకిలీ ఆయిల్స్‌ తయారీకి యూరియా సరఫరాపై పూర్తిస్థాయి విచారణ.. జేడీఏ హబీబ్‌ బాషా

ముదినేపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి కేంద్రంగా జరుగుతున్న మోటారు వాహనాల నకిలీ ఇంజన్‌ ఆయిల్స్‌ తయారీపై పూర్తిస్థాయి విచారణ జరిపి యూరియా ఎరువును సరఫరా చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లను రద్దు చేస్తామని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ హబీబ్‌ బాషా తెలిపారు. వ్యవ సాయానికి ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరి యాను నకిలీ ఇంజన్‌ ఆయిల్స్‌ తయారీకి విని యోగిస్తున్నారని తెలుసుకున్న ఆయన బుధ వారం వ్యవసాయశాఖ అధికారులతో కలసి ముదినేపల్లిలోని తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ 27 బస్తాల యూరియా నిల్వ లను కనుగొన్నారు. ప్రాథమిక విచారణలో యూరియాను కృష్ణా జిల్లా నిడుమోలు సొసై టీ నుంచి కొనుగోలు చేసినట్టు నకిలీ ఆయిల్స్‌ తయారీదారులు తెలిపారన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఇస్తున్న యూరియాను పక్కదారి పట్టించే డీలర్లు, సొసైటీలపై చర్యలు తీసుకుంటామని, లైసెన్సులు రద్దు చేస్తామని జేడీఏ తెలిపారు. విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏడీఏ వెంకట మణి, ఏవో వేణు మాధవ్‌ను ఆదేశిం చారు. ముదినేపల్లిలోని రెండు ఎరు వుల దుకాణాలను జేడీఏ తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేకుండా రెండు షాపు ల్లోను రూ. 3.87 లక్షల విలువైన 16.86 టన్నుల ఎరువులను గుర్తించడంతో అమ్మకా లను నిలుపుదల చేయాలని ఆదేశించారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

ముదినేపల్లిలో నిర్వహిస్తున్న నకిలీ ఇంజన్‌ ఆయిల్స్‌ తయారీ కేసులో నిందితులైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ముదినేపల్లికి చెందిన కె.వెంకటసురేష్‌, పి.నరేంద్రలను మం గళవారం అదుపులోకి తీసుకున్న విష యం తెలిసిందే. వారిని విచారించిన అనంతరం బుధవారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో కైకలూరు సీఐ రవికుమార్‌, ముదినేపల్లి ఎస్‌ఐ వీర భద్రరావు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముదినేపల్లి ఏఎస్‌ఐ ఆకుల శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది మంగళవారం గస్తీ తిరుగుతుండగా ఒక ఇంటిలో నకిలీ ఆయిల్‌ తయారీని గమనించి ఫిర్యాదు చేశార న్నారు. తయారీ జరుగుతున్న ఇంటి నుంచి ఆయిల్‌ పీపాలు, కల్తీ ఆయిల్‌వున్న 20 లీటర్ల ప్లాస్టిక్‌ డబ్బాలు నాలుగు, కలర్‌ కెమికల్‌ డబ్బాలు 4, వివిధ కంపెనీల లేబుల్స్‌, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jan 01 , 2026 | 12:30 AM