Share News

తుఫాన్లను తట్టుకుని..

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:12 AM

అర్నబ్‌, మురసు తుఫాన్ల ధాటికి ఉమ్మడి జిల్లాలోని పంటలన్నీ కుదేలయ్యాయి. కానీ, ప్రకృతి వ్యవసాయం చేసిన పంటలు పెనుగాలులను తట్టుకుని నిలబడ్డాయి. రసాయన ఎరువులతో సాగు చేసిన పంటలు మాత్రం నేలకొరిగాయి.

తుఫాన్లను తట్టుకుని..
ప్రకృతి వ్యవసాయం

తుఫాన్లను తట్టుకుని..

మేలు చేసిన ప్రకృతి వ్యవసాయం

అర్నబ్‌, మురసు తుఫాన్ల ధాటికి ఉమ్మడి జిల్లాలోని పంటలన్నీ కుదేలయ్యాయి. కానీ, ప్రకృతి వ్యవసాయం చేసిన పంటలు పెనుగాలులను తట్టుకుని నిలబడ్డాయి. రసాయన ఎరువులతో సాగు చేసిన పంటలు మాత్రం నేలకొరిగాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో సాహెబ్‌ అనే రైతు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సంపత్‌ స్వర్ణ రకాన్ని సాగు చేశారు. ఆ పొలం పక్కనే రవి అనే రైతు అదే రకాన్ని రసాయన పద్ధతిలో వేశారు. అర్నబ్‌ తుఫాను గాలులకు రవి పొలం పూర్తిగా నేలకొరగ్గా.. సాహెబ్‌ పొలం ఏ మాత్రం దెబ్బ తినకుండా నిటారుగా నిలబడింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా

ఇలా ప్రకృతి వ్యవసాయం చేసిన ఎంతో మంది రైతుల పొలాలు భారీ వర్షాలు, తుఫాను గాలులను తట్టుకోవడం విశేషం.

ఏలూరు సిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి):ప్రకృతి వైపరీత్యా లు వచ్చిన ప్రతిసారీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగానే మారుతోంది. ఇటీవల వచ్చిన అర్నబ్‌, మురసు తుఫాన్లు ఏలూ రు జిల్లాలో భీభత్సం సృష్టించాయి. ఏభై వేల ఎకరాలకు పైగా వరి పంట నేలకొరిగి నీటమునిగింది. ఇప్పటికీ కొన్ని పొలాల నుంచి నీరు బయటకు రాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రసాయన సాగు పొలాలు 50 నుంచి 70 శాతం వరకు దెబ్బ తినగా.. ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాలు 20 శాతంలోపే నష్టపోయాయని రైతులు, అధికారులు చెబుతున్నారు. 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో అత్యంత తీవ్రమైన పెనుగాలు లు వీస్తే తప్ప.. సాధారణ గాలులకు ప్రకృతి వ్యవసాయ పంట లు దెబ్బతినే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వేరు వ్యవస్థ బలంగా ఉండటమే కారణం

ప్రకృతి వ్యవసాయంలో మొక్కల కొమ్మలు, వేరు వ్యవస్థ అత్యంత బలంగా ఉండటమే అవి తుఫాన్లను తట్టుకోవడానికి ప్రధాన కారణమని జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్‌ హబీబ్‌ బాషా తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల భూమి గుల్లబారి వేరు వ్యవస్థ లోతుగా వెళ్లి బలపడుతుంది. అదే రసాయన సాగులో వేరు వ్యవస్థ చిన్నగా ఉండి వృద్ధి తక్కువగా ఉంటుంది. పైగా ప్రకృతి సేద్యంలో 365 రోజులు భూమిని కప్పి ఉంచడం, పశువులను మేపడం, ఆ తర్వాత కలియదున్నడం వల్ల భూసారం విపరీతంగా పెరుగుతుంది. వానపాములు, సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. దిగుబడులు కాస్త తక్కువగా వచ్చినా.. విపత్తులను తట్టుకునే శక్తి ఉన్నందున ప్రకృతి వ్యవసాయమే మేలని సూచిస్తున్నారు.

జిల్లాలో లక్షా ఐదు వేల ఎకరాల్లో సాగు

ఏలూరు జిల్లాలో నాలుగైదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం సాగు అవుతోంది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి లక్షా ఐదు వేల ఎకరాలకు చేరింది. తుఫాన్లకు ఐదు వేల ఎకరాలకు పైగా దెబ్బతింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎంటీయూ–1318, సంపత్‌ స్వర్ణ రకాలతోపాటు.. దేశీయ రకాలైన కూజీ పటాలి, మైసూర్‌ మల్లిక వంటి వాటిని రైతులు సాగు చేశారు. దేశీయ రకాలకు ఎకరానికి 20 నుంచి 25 బస్తాలు.. ఎంటీయూ–1318, సంపత్‌ స్వర్ణ రకాలకు 40 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. అలాగే ఈ ఖరీఫ్‌లో ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌(పీఎండీఎస్‌) పద్ధతిలో ఏడు జాతులకు చెందిన 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 కిలోల చొప్పున చల్లి సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడమే కాకుండా భూసారాన్ని పెంచే ఈ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

వెన్ను చూపని పొలాలు

మొగల్తూరు, నవంబరు 10(ఆంధ్ర జ్యోతి):‘పశ్చిమ గోదావరి జిల్లా మొగ ల్తూరుకు చెందిన మన్నే నర్సింహరా వు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని సేంద్రీయ పద్ధతిలో ఎలాం టి రసాయనాలు వాడకుండా సంప త్‌ స్వర్ణ రకం వరితో సార్వా సాగు చేశా. రెండు విపత్తులు, భారీ ఈదు రుగాలులకు, భారీ వర్షానికి సేంద్రీయ పద్ధతిలో చేపట్టిన సాగులో 60 శాతం వరి నేల వాలకుండా బలంగా నిలబడింది. నా సరిహద్దున ఇదే రకం వరి సాగు చేసిన రైతు రసాయనిక పద్ధతిలో చేపట్టడంతో ఆ చేలు నేలకు వాలి కుళ్లిపోయాయి. ప్రకృతి పద్ధతిలో చేపట్టిన సాగు భరోసాతోపాటు, తక్కువ ఖర్చుతో సాగు చేయగలిగా. రెండు విపత్తులను తట్టుకుని వరి నిబడటం ఆనందంగా ఉంది’ అని రైతు కుక్కల నాగరాజు తెలిపారు.

ఎర్రకాలువ ముంపు లేకుంటే..

పెంటపాడు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి):పెంటపాడు మం డలం బి.కొండేపాడుకు చెందిన మహిళా రైతు పాలా సాయి పద్మ అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఎరువు లు, పురుగు మందుల జోలికి వెళ్లకుండా కేవలం నవ ధాన్యా లు, ఆవు పేడ, వేప కషాయం, తదితర వాటితో ప్రకృతి వ్యవ సాయాన్ని చేపట్టింది. చుట్టుపక్కల అందరి పొలాలు అర్నబ్‌ తుఫాన్‌ దాటికి వీచిన గాలులతో పడిపోయినప్పటికి ఈ పొలం నిలబడింది. కాని, ముసురు తుఫానులో భారీ వర్షాలకు ఎర్ర కాలువ పొంగడంతో నాలుగు రోజులుగా ఈ పంట కూడా ముంపులోనే ఉండడంతో కుళ్లిపోయే దశకు చేరుకుంది.

Updated Date - Nov 11 , 2026 | 12:12 AM