Share News

చర్మకారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:52 AM

చర్మకారుల ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీ రుణ యూనిట్లు వెంటనే మంజూరు చేయాలని, లీడ్‌క్యాప్‌ను ప్రక్షాళన చేసి చర్మకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జు వరపు రవిప్రకాష్‌ డిమాండ్‌ చేశారు.

చర్మకారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి
ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న చర్మకారులు, డప్పు కళాకారులు

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి) : చర్మకారుల ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీ రుణ యూనిట్లు వెంటనే మంజూరు చేయాలని, లీడ్‌క్యాప్‌ను ప్రక్షాళన చేసి చర్మకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జు వరపు రవిప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వి హంచారు. ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన చెప్పులు కుట్టే, లెదర్‌ వర్క్‌ చేసే చర్మకారులు, డప్పు కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్మకారులు, డప్పు కళాకారులకు అర్హత మేరకు సంక్షేమ పెన్షన్లు మంజూరు చేసి, నెలకు రూ.6వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లిగూడెంలో లెదర్‌పార్కు, చెప్పులు కుట్టే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సబ్సిడీ యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఇన్‌చార్జి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాకర్లమూడి వెంకటరావు, చీలి మోహనరావు, దిరిసిపాం కృష్ణమూర్తి, లక్కపాము దాసు, పింగళి నాగేశ్వరరావు, కలిడి రవి, దూలపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:52 AM