ఆక్రమణలు తొలగించాలని ధర్నా
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:30 AM
తమ గ్రామం మీదుగా రహదారి నిర్మించే ముందు రహదారి వెంబడి గల ఆక్రమణలు తొల గించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్థులు రహదారి నిర్మాణ పనులు అడ్డుకుని రహదారిపై ధర్నా నిర్వహిం చారు.
మొగల్తూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):తమ గ్రామం మీదుగా రహదారి నిర్మించే ముందు రహదారి వెంబడి గల ఆక్రమణలు తొల గించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్థులు రహదారి నిర్మాణ పనులు అడ్డుకుని రహదారిపై ధర్నా నిర్వహిం చారు. ఈసందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మొగల్తూరు రామాలయం సెంటర్ నుంచి కోట, శేరేపాలెం మీదుగా కొప్పర్రు వరకు పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగంలో రహదారి నిర్మాణం చేపట్టారని రహదారి ఆరంభంలో గల అక్రమణలు తొలగించిన అధి కారులు కోట వద్ద మూడురోడ్లు కూడలిలో గల ఆక్రమణలు తొల గించకుండా రహదారి నిర్మాణం చేస్తున్నారన్నారు. ఇక్కడ అక్రమణలు తొలగించకుండా రహదారి నిర్మిస్తే నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తి స్థాయిలో కోట వద్ద ఆక్రమణలు తొలగించి నిర్మాణ పనులు చేయా లని అప్పటి వరకూ రహదారి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని బైటాయించడంతో నిర్మాణ పనులు నిలుపుదల చేశారు. ఈ ఆందోళనలో సూదాబత్తుల సత్యనారాయణ, సూరిబాబు, కొప్పిశెట్టి లాలిబాబు, వాసర్ల అంజి, వాసర్ల రాంబాబు, పొతురెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.