చేసిన పనులే.. మళ్లీ చేస్తారు..!
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:51 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోని నూజివీడు నియోజక వర్గానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారు. అయితే నూజివీడు నియోజకవర్గం బయట నుంచి వచ్చిన వలస కాంట్రాక్టర్లు నూజివీడు పట్టణంలోని పలు పనులను దక్కించు కోగా అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరకపు పనుల నేపథ్యం లో చేసిన పనులను తిరిగి చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
కానరాని అధికారుల పర్యవేక్షణ
నూజివీడు–తిరువూరు రహదారిపై
సీసీ రోడ్డు పునర్నిర్మాణం
తాజాగా కూలిన నిర్మాణంలో ఉన్న డ్రెయినేజీ గోడ
నూజివీడు టౌన్, జనవరి 30(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోని నూజివీడు నియోజక వర్గానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారు. అయితే నూజివీడు నియోజకవర్గం బయట నుంచి వచ్చిన వలస కాంట్రాక్టర్లు నూజివీడు పట్టణంలోని పలు పనులను దక్కించు కోగా అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరకపు పనుల నేపథ్యం లో చేసిన పనులను తిరిగి చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నూజివీడు–తిరువూరు ప్రధాన రహదారిపై కొప్పుల వెలమపేట వద్ద ఇటీవల నిర్మించిన రహ దారిపై తిరిగి సీసీ రహదారిని వేయడం. కాగా తాజాగా పట్టణం లో బాపునగర్‌లో మురుగు డ్రెయిన్‌కు రెండు వైపులా గోడలు కడుతూ ఉండగా పనులు పూర్తవ్వకుండానే ఆ గోడలు కూలిపో యాయి. పట్టణంలో బాపునగర్ వెళ్లే రహదారిలో రామకృష్ణసేవా సమితి ఎదురుగా 13వ వార్డులో తకెళ్ళగుంట వాగుపై మురుగు డ్రెయిన్ పనులను అధికారులు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టా రు. వారం రోజులుగా పెనుమలూరు నియోజకవర్గానికి చెందిన కాంట్రాక్టర్ డ్రెయిన్ రెండు వైపులా గోడల నిర్మాణం చేపట్టగా శుక్రవారం ఒక పక్క నిర్మించిన గోడ ముక్కల ముక్కలుగా విరిగి పోయి కూలిపోయింది. ఏళ్లపాటు మన్నాల్సిన డ్రెయినేజీ నిర్మాణ సమయంలోనే దెబ్బతినడం అధికారుల పర్యవేక్షణ లోపమా లేక, నాణ్యత లోపించడం వల్ల జరిగిందా.. అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి నాణ్యత లోపం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.
తిరిగి రహదారి నిర్మాణం..
నూజివీడు–తిరువూరు ప్రధాన రహధారిపై కొప్పుల వెలమ పేట వద్ద కోట్లాది రూపాయల వ్యయంతో ఇటీవల సీసీ రహ దారిని నిర్మించారు. రహదారి నిర్మాణం సయమంలోనే నాణ్యత లోపంపై విమర్శలు తలెత్తిగా రహదారి ప్రారంభమైన కొద్ది కాలానికే రోడ్డుపై రాళ్లు బయట పడడంతో నిర్మాణ సమయంలో పలు నాణ్యత లోపాలపై నాడు ‘ఆంధ్రజ్యోతి’లో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారుల పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ మరమ్మతులు సైతం సక్రమంగా లేకపోవడంతో అధికారులు తిరిగి మూడు అంగుళాలతో సీసీ రోడ్డుపై తిరిగి రోడ్డు నిర్మాణాన్ని తాజాగా చేపట్టారు. అదే తొలుత నిర్మాణ సమయంలోనే నాణ్యతా ప్రమాణాలు లోపం జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టి ఉంటే కోట్లాది రూపాయల ప్రజాధనం వృఽథా కాకుండా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.