ఆచంటేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:17 AM
వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా శుక్రవారం జిల్లాలోని ఆచంటేశ్వరునికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.
ఆచంట, జూలై 10(ఆంధ్రజ్యోతి): వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా శుక్రవారం జిల్లాలోని ఆచంటేశ్వరునికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను స్వామి వారి ఆలయానికి తీసుకొచ్చి వెయ్యి కుండల నీళ్లతో స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో రంగరాజు, ఆలయ చైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు, కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.