రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:25 AM
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆచంట, నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
వేడుకగా ఆచంట ఏఎంసీ పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం
ఆచంట, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆచంట, నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆచంట మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన వేడుకగా జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత ప్రభుత్వం మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసిందని కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడిందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నికైన కేతా సత్యవతి, వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన ముచ్చర్ల నాగ సుబ్బారావు, డైరెక్టర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత నూతన పాలక మండలి భ్యులు ఆయా గ్రామాల నుంచి పలు వాహనాల్లో ఊరేగింపుగా సభా స్థలికి చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, మహ్మద్ షరీఫ్, వలవల బాబ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కొత్తూరి రామరాజు, పిల్లి సత్తిరాజు తదితర నాయకులు మాట్లాడారు.