Share News

ముగ్గురి మృతి

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:38 AM

పట్టణ పరిధిలో కొమరవరం వెళ్లే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందా రు.

 ముగ్గురి మృతి

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ద్విచక్రవాహనం నుంచి ఎగిరిపడి తల్లీకూతుళ్లు.. ప్రైవేటు బస్సు ఢీకొని వృద్ధురాలు..

తణుకు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో కొమరవరం వెళ్లే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందా రు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గంధం వంశీకృష్ణ, భార్య లావణ్య(22), కుమార్తె కీర్తన(2) ముగ్గురు కలిసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై లావణ్య పుట్టినిల్లు గణపవరం మండలం బువనపల్లికి బయల్దేరారు. కొమరవం రోడ్డు లోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద ఉన్న స్పీడు బ్రేకర్‌ కనిపించకపోవడంతో వంశీకృష్ణ నడిపే ద్విచక్రవాహనం అదుపుతప్పి ముగ్గురూ ఎగిరి కిందపడ్డారు. భార్య లావణ్యకు స్తంభం ఢీకొ నడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలి స్తుండగా మృతి చెందింది. కుమార్తె కీర్తన తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్క డే మృతి చెందింది. స్థానికులు 108కి ఫోన్‌ చేయడంతో వారిని తణుకు ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు.తీవ్రగాయాలైన వంశీకృష్ణను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మందుల కోసం వెళ్లిన వృద్ధురాలు..

పెదపాడు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్‌ సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమ వారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం నూజివీడు మండలం పొలసాని పల్లి గ్రామానికి చెందిన వీరమల్లి కోటేశ్వరమ్మ (60) ప్రతి నెలా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసు కుని వెళ్తోంది. ఏలూరు వచ్చినప్పుడు మార్గమ ధ్యలో పెదపాడు మండలం వేంపాడులో నివా సముంటున్న మనుమరాలు దగ్గరకి వెళ్లి రెండ్రో జులు ఉండి వెళ్తుంది.ఈ నేపథ్యంలో మందుల కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మం దులు తీసుకుని ఏలూరు నుంచి హను మాన్‌ జంక్షన్‌ బస్‌ ఎక్కింది. మార్గమధ్యలో కొక్కిరపాడు అడ్డరోడ్డు వద్ద బస్‌ దిగి వేంపాడు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రైవేటు ట్రావెల్స్‌ ఢీకొన డంతో కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెం దింది.సమాచారం అందుకున్న పెదపాడు పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసు పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:38 AM