Share News

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:29 AM

బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
హైవేపై ఆగి ఉన్న వారిని ఢీకొట్టిన వ్యాను

హైవేపై ఆగి ఉన్న వారిని ఢీకొట్టిన వ్యాను – ఒకరి మృతి మరో ముగ్గురికి గాయాలు

ఏలూరు క్రైం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజ యవాడ బుడమేరు సమీపంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న పాలపర్తి సాయి దుర్గారావు(28)కి భార్య జోజమ్మ, ఒక కుమా రుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా డు. దుర్గారావు సోదరుడు దెందులూరు మం డలం జంగారెడ్డిగూడెంలోని గంగన్నగూడెంలో ఉండడంతో ఆ సోదరుడి కుమారుడికి మం గళవారం సాయంత్రం పెళ్లిచూపులు జరిగా యి. దుర్గారావు, అతని భార్య జోజమ్మ, అదే కాలనీకి చెందిన చిట్టిపాతల వెంకటేశ్వరమ్మ (45), ఆమె భర్త వెంకటేశ్వరరావు(50), కట్టా కృష్ణయ్య(50), సత్యనారాయణ(60)లు కలిసి మూడు మోటార్‌ సైకిళ్లపై విజయవాడ వాంబే కాలనీ నుంచి గంగన్నగూడెం వెళ్లారు. మంగ ళవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్‌పై విజయవాడకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఏలూరు సమీపం లోని దుగ్గిరాల బ్రిడ్జి వద్దకు వచ్చే సరికే కట్టా కృష్ణయ్య మోటారు సైకిల్‌లో పెట్రోల్‌ అయి పోయింది. దీంతో బ్రిడ్జిపై ఆగి ఉన్నారు. మరో బండిలో పెట్రోల్‌ తీసి పోసే క్రమంలో వారంతా రోడ్డుపైనే నిలబడి ఉండగా ఒక మినీవ్యాన్‌ వేగంగా వారిని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సాయిదుర్గారావు అక్కడిక క్కడే మృతి చెందగా అతని భార్య జోజమ్మ, వెంకటేశ్వరమ్మ, కృష్ణయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్సులో ఏలూరు ప్ర భుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమి త్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - Mar 25 , 2026 | 12:29 AM