Share News

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

ABN , Publish Date - May 15 , 2026 | 12:37 AM

ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్‌ వెంపల్లి బాల రామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌
ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్‌ రామచంద్రరావు

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

ప్రేమ వ్యవహారంలో యువకుడికి బెదిరింపులు

రూ.2 లక్షలు డిమాండ్‌

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్‌ వెంపల్లి బాల రామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నీలపు కుమారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దుబాయ్‌లో ఉంటుండగా చిన్న కుమా రుడు అభిలాష్‌ ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అభిలాష్‌ పట్టణానికి చెందిన 19 సంవత్సరాల యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వారిద్దరూ గత నెల 24న తాడేపల్లిగూడెం నుంచి వెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు తాడేపల్లిగూడెం టౌన్‌ పోలీస్టేషన్‌లో యువతి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.తర్వాత ఏలూరులో కనపడడంతో తల్లిదండ్రులకు అప్పగించారు.అయితే ఈ వ్యవహారంలో అత్యాచారం కేసు పెడ తానని యువకుడిని ఎస్‌ఐ బెదిరించాడు. కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తమకు అంత స్తోమత లేదని ఎస్‌ఐని వేడుకున్నప్పటికీ పదేపదే స్టేషన్‌కు పిలిచి వేధించారు. రూ.70 వేలు అయినా ఇవ్వా లని పోలీసులు చెప్పడంతో అభిలాష్‌ తల్లి ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చగా అధికారులు ట్రాప్‌ చేశారు. వారు ఇచ్చిన రూ.70 వేలు కానిస్టేబుల్‌కు ఇస్తుండగా పట్టుకుని విచారించగా ఎస్సై తీసుకోమంటేనే తీసుకున్నానని వివరించి నట్టు తెలిపారు. దీంతో ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌పై ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా సెటిల్‌ మెంట్లకే మొగ్గు చూపుతారని చెబుతు న్నారు. గతంలో ఓ బంగారం వ్యాపారి ఖాతాదారుల నుంచి భారీగా బంగారం దోచేస్తే బాధితులకు అందకుండా హాంఫట్‌ చేశారనే విమర్శలున్నాయి.

Updated Date - May 15 , 2026 | 12:37 AM