ఏసీబీ వలలో అవినీతి అధికారి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:40 AM
ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.
రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ
పట్టుబడిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
భీమవరం క్రైం, ఫిబ్రవరి 24 (ఆంధ్ర జ్యోతి) : ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు (ఏలూరు) తెలిపిన వివరాలివి.. నరసాపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సాధు సురేష్‌కుమార్ భీమవరం ఇన్‌ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ఒక సామిల్లు నడుపుకునే వ్యక్తి రెన్యువల్ కోసం సద రు ఆఫీసర్‌ను ఆశ్రయించగా అతడు రూ.4లక్షలు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని మొత్తుకు న్నాడు. దఫదఫాలుగా ఇస్తానన్నా కూడా వినకపోవడంతో సామిల్లు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారి సాధు సురేష్‌కుమార్ భీమవరం హౌసింగ్ బోర్డులో నివాసంలో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతడు రూ. 4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం పలు కార్యాలయాలను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సీఐ శ్రీనివాస్‌తోపాటు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.