Share News

పట్టణ ప్రణాళికకు ముచ్చెమటలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:37 AM

నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో మూడు రోజులుగా విస్తృతదా డులు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసా గుతున్నాయి.

పట్టణ ప్రణాళికకు ముచ్చెమటలు
ఏలూరు నగరపాలక సంస్థలో రికార్డుల పరిశీలన

మూడు రోజులుగా ఏసీబీ దాడులు

విస్తృతంగా రికార్డుల పరిశీలన.. సిబ్బందిపై ప్రశ్నల వర్షం

ఏలూరు నగరపాలక సంస్థలో మూడు రోజులుగా నిలిచిన పౌరసేవలు

ఏలూరు టూటౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యో తి): నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో మూడు రోజులుగా విస్తృతదా డులు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసా గుతున్నాయి. ముందురోజు రికార్డులను పరిశీ లించారు. కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్‌ పేమెంట్లను పరిశీలించా రు. ఈ సందర్భంగా సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిబ్బంది నుంచి కీలక సమా చారం రాబట్టిన ఏసీబీ అధికారులు పలు రికా ర్డులు స్వాఽధీనం చేసుకున్నారు. రెండవరోజు బుధవారం క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలి ంచారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అప్రూవల్‌ చేసిన ప్లానింగ్‌లకు అనుగుణంగా క్షేత్రస్థాయి లో నిర్మాణాలు జరిగాయా లేదా అని పరిశీ లించారు. ఈ పరిశీలనలో చాలా భవనాలు, బహుళ అంతస్థులు, వాణిజ్య సముదాయాలు అప్రూవల్‌ అయిన ప్లానింగ్‌కు అనుగుణంగా నిర్మాణాలు జరిగాయా లేదా అని పరిశీలిం చారు. ఇచ్చిన ప్లాన్‌లకు, కట్టిన నిర్మాణాలకు చాలా చోట్ల వ్యత్యాసాలు ఉండటాన్ని ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికా రులు గుర్తించారు. ప్లాన్‌ కోసం యాజమాని కి ఎన్నిరోజుల క్రితం దరఖాస్తు చేశాడు. ఎన్ని రోజులకు ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చారు, ఎన్ని దర ఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఎందుకు పెండింగులో ఉన్నాయని సిబ్బందిని ప్రశ్నించా రు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ స్కీమ్‌లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని దరకాస్తులు క్లియర్‌ చేశారు. ఎన్ని పెండింగులో ఉన్నాయో పరిశీలించారు. నెలల తరబడి ఎల్‌ఆర్‌ఎస్‌ దరకాస్తులు పెండింగులో ఉండటాన్ని ప్రశ్నిం చారు. గురువారం ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు బృందం పట్టణ ప్రణాళిక సిబ్బందిని తమ కార్యాలయానికి పిలిపించుకుని అనుమానం ఉన్న దరఖాస్తులపై వివరాలు అడిగి తెలు సుకుంటున్నారు. మూడు రోజుల నుంచి ఏసీ బీ అధికారులు నగరపాలక సంస్థలో తనిఖీలు చేయడం, క్షేత్రస్థాయిలో పరిశీలించటం, అనం తరం సిబ్బందిని ఏసీబీ కార్యాలయానికి పిలు పించుకుని ప్రశ్నల వర్షం కురిపించటంతో పట్టణ ప్రణాళిక సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఎందుకంటే పట్టణ ప్రణా ళిక విభాగంలో అవినీతి తారాస్థాయికి చేరిన ట్లు పలు పిర్యాదులు వెల్లువెత్తడంతో సిబ్బం దికి చెమటలు పడుతున్నాయి. సామాన్య మానవుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టు కోవాలంటే ఎల్‌ఆర్‌ఎస్‌కి కానీ, బీపీఎస్‌కు కానీ ప్లాన్‌ అప్రూవల్‌కు కానీ లక్షలాది రూపాయ లు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా చూస్తే వా ణిజ్య సముదాయాలు, లేఅవట్లు, అపార్ట్‌మె ంట్లు, బహుళ అంతస్తుల బిల్డింగుల నుంచి ఇంకెన్ని లక్షలు వసూలు చేస్తారోనని గుసగు సలు వినిపించే తరుణంలో ఏసీబీ దాడులు జరగటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిం ది. ఏసీబీ దాడుల కారణంగా పౌరసేవలు నిలిచిపోయాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో ఏ ఒక్క సిబ్బంది ఏసీబీ తనిఖీల కారణంగా అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మా ణాల ప్లాన్‌ల అప్రూవల్‌కు వచ్చిన ప్రజలంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.

డిమాండ్‌ చేసినంత ఇవ్వాల్సిందే

భవన నిర్మాణాల అనుమతుల కోసం వాళ్లు ఎంత డిమాండ్‌ చేస్తే అంత చెల్లించాల్సిందే. నగర పాలక సంస్థ పరిధిలో సుమారుగా 40మందికి పైగా టెక్నికల్‌ లైసెన్స్‌డ్‌ పర్సన్స్‌ (లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌) ఉన్నారు. వీరంతా మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం ప్లాన్‌లు గీసిస్తారు. ఈ ప్లాన్‌ల ప్రకారమే అనుమతులు మంజూరవుతాయి. అయితే ఇక్కడ నలుగురు ప్లానింగ్‌ సెక్రటరీలతో పా టు కేవలం నాలుగు, ఐదు లైసెన్సుడు సర్వే యర్‌లతో కుమ్మక్కై గంపగుత్తగా బేరాలడు తుంటారు. మిగిలిన లైసెన్సుడు సర్వేయర్‌లు ప్లాన్‌లు గీస్తే వారికి ఏదో ఒక వంక పెట్టి ప్లాన్‌లను వెనక్కి తిప్పిపంపుతారు. వార్డు ప్లానర్స్‌తో కుమ్మక్కైన ఆ ఐదు, ఆరు లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌ ప్లాన్‌లకు ఎటువంటి అభ్యంత రాలు చెప్పకుండా అప్రూవల్‌ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ప్లాన్‌ అప్రూవల్‌కు ఎంత లంచం ఇవ్వాలో యాజ మానులకు చెబుతాడు. వారి వద్ద నుంచి వసూలు చేసిన సొమ్మును పంచుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రణాళిక విభా గంలో జరుగుతున్న అవినీతిలో ప్రజాప్రతి నిధుల పాత్ర ఎంతో ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో జరుగుతున్న ఏసీబీ దాడులకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - Mar 13 , 2026 | 12:37 AM