Share News

నిప్పుల కొలిమి!

ABN , Publish Date - May 21 , 2026 | 12:25 AM

జిల్లాలో బుధవారం సూరీడు నిప్పులు చెరిగాడు. వడగాడ్పుల తీవ్రతతో ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు భీతిల్లిపోయారు.

నిప్పుల కొలిమి!
బుధవారం ఉదయం 11 గంటలకే ఎండల ధాటికి నిర్మానుష్యంగా మారిన పెదపాడు మెయిన్‌ రోడ్డు..

ఎటు చూసినా వేడిగాలులే.. మరో వారం ఇదే పరిస్థితి

అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు .. జిల్లా అధికారుల హెచ్చరికలు

చింతలపూడిలో అత్యధికం 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో బుధవారం సూరీడు నిప్పులు చెరిగాడు. వడగాడ్పుల తీవ్రతతో ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు భీతిల్లిపోయారు. జిల్లాలో రెండు రోజులుగా వడగాడ్పుల తీవ్రత పెరి గింది. రాబోయే వారం రోజులు భానుడి ప్రతాపం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది.

(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అత్యధికంగా చింతలపూడి మండ లంలో 45.7 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమో దు కాగా పెదపాడు 45.2, కుక్కునూరు 45, నూజివీడు 44.6, పెదవేగి, దెందులూరుల్లో 44.2, ఏలూరు 43.7, పోలవరం, కొయ్యల గూ డెంల్లో 43.2,బుట్టాయిగూడెం43.1, జంగారెడ్డి గూడెం 40.9, భీమడోలు 39, ద్వారకా తిరుమ ల ప్రాంతాల్లో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. గురువారం 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. ఈ నెల 21న జిల్లాలో 28 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, 22న మూడు మండ లాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తా యని, 25 మండలాల్లో తీవ్రకరమైన వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. ఈనెల 26 వర కు తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఏర్ప డే అవకాశం ఉన్నందున్న ప్రజలు అప్ర మత్తం గా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి కోరారు. వాతా వరణశాఖ హెచ్చరికలతో రాబోయే ఏడు రోజు లకు ప్రాధాన్యత, తక్షణ సన్నద్దత, ఉపశమన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లు, అఽధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

రోహిణి కార్తెలో పరిస్థితి ఏంటి..?

కృత్తిక కార్తెలోనే అత్యంత వేడిగాలులు వీస్తుండగా, రాబోయే రోహిణి కార్తెలో పరిస్థి తులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆందోళన ప్రజల్లో కలిగిస్తోంది. కొన్నేళ్లుగా ఇలాంటి పరి స్థితులు కనిపించలేదు. పగలు తీవ్రంగా అత్యం త వేడిగాలులతో ఎండ వేడిమి ఉన్నా సాయం త్రమయ్యే సరికి వాతావరణం ఈదురు గాలులు కారణంగా చల్లబడేది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయం వరకు ఎండ వేడిమి తగ్గక పోగా వేడి గాలులు ప్రభావం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమైనా ఉక్కబోతను తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.

రోడ్లు నిర్మానుష్యం

దెందులూరు/ చాట్రాయి/ కామవరపు కోట/ గణపవరం/పెదపాడు/ ఏలూరు రూరల్‌ : దెందులూరులో రద్దీగా ఉండే సంతమార్కెట్‌, లైబ్రరీ, 10వ వార్డు సెంటర్‌ సెంటర్లు బుధ వారం ఉదయం 11 గంటల నుంచే ఎండ ధాటికి నిర్మానుష్యంగా మారాయి. 16వ నెంబర్‌ జాతీయ రహదారి మీద వాహనాల రాకపోకలు సైతం తగ్గాయి. చాట్రాయి మండలంలో మధ్యా హ్న సమయంలో వడగాల్పులకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కామ వరపుకోట మండలంలోని గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వడ గాడ్పులు వీయడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు బెంబేలెత్తారు. వీధులన్నీ కర్ఫ్యూ విధిం చారా.. అన్నట్టు నిర్మానుష్యంగా మారాయి. గణపవరం మండలంలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడి పోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పెదపాడులో 45 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. పెదపాడు బస్టాండ్‌ సెంటర్‌, ఇతర ముఖ్య ూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఏలూరు రూరల్‌ మండలంలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ నుంచి రక్షణగా కొందరు గొడుగులు ఉపయోగించగా మరికొందరు చీర కొంగులు, దుపట్టాలు, తువ్వా ళ్ళు కప్పుకుని ప్రయాణించారు. కొందరు కార్డ్‌బోర్డు ముక్కల వంటి వస్తువులను తలప పెట్టుకుని పనులకు వెళ్లారు.

కార్మికులు జాగ్రత్తలు పాటించాలి..

ఏలూరు టూటౌన్‌ : జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపకార్మిక కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం ఎండల నుంచి కార్మికులను రక్షించే బాధ్యత యాజమాన్యాలదే అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్మికులతో పనులు చేయించకూడదన్నారు. అసిస్టెంట్‌ లేబర్‌ రమణ ఆధ్వర్యంలో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్‌లో)

మండల కేంద్రం నిన్న నేడు రేపు

ఏలూరు 43.7 46.4 45.7

నూజివీడు 44.6 46.3 45.4

జంగారెడ్డిగూడెం 40.9 45.5 45.8

చింతలపూడి 45.7 45.3 44.7

కొయ్యలగూడెం 43.2 45.8 46.6

కుక్కునూరు 45.0 46.4 46.8

బుట్టాయిగూడెం 43.1 45.2 48.1

భీమడోలు 39.0 46.5 46.2

పెదవేగి 44.2 46.3 45.7

పెదపాడు 45.2 46.7 45.5

దెందులూరు 44.2 46.5 46.2

పోలవరం 43.4 45.9 48.8

కామవరపుకోట 42.8 45.9 45.6

ఆగిరిపల్లి 44.4 46.4 45.6

చాట్రాయి 43.8 45.5 44.8

ద్వారకాతిరుమల 41.1 46.2 45.9

జీలుగుమిల్లి 43.8 45.1 45.8

కైకలూరు 43.1 46.5 45.8

కలిదిండి 43.0 46.5 45.4

లింగపాలెం 44.8 45.7 45.2

మండవల్లి 43.1 46.6 45.6

ముదినేపల్లి 43.1 46.5 45.3

ముసునూరు 44.8 46.1 45.2

నిడమర్రు 38.0 46.5 45.8

టి.నరసాపురం 40.9 45.3 45.3

ఉంగుటూరు 44.2 46.5 45.8

వేలేరుపాడు 39.6 46.3 48.7

Updated Date - May 21 , 2026 | 12:25 AM