7,30,185
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:35 AM
జిల్లాలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల గణనను చేపట్టారు. 27 మండలాలు, ఏలూరు కార్పొరేషన్, మూడు మున్సి పాల్టీల్లో కలుపుకుని ఇళ్ల గణన చేపట్టేందుకు 3,881 బ్లాక్లుగా ఆయా ప్రాంతాలను విభజించారు.
వచ్చే ఫిబ్రవరిలో వ్యక్తులవారీగా గణన
ఏలూరు నగరంలో లక్ష దాటేసిన ఇళ్లు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల గణనను చేపట్టారు. 27 మండలాలు, ఏలూరు కార్పొరేషన్, మూడు మున్సి పాల్టీల్లో కలుపుకుని ఇళ్ల గణన చేపట్టేందుకు 3,881 బ్లాక్లుగా ఆయా ప్రాంతాలను విభజించారు. ఎన్యుమరేటర్లు మొత్తం 4,171 మంది ఇంటింటా తిరిగి డోర్ నెంబర్ల వారీగా వివరాలను సీఎంఎం యాప్‌లో నమోదు చేశారు. వాస్తవంగా మే నెలాఖరున పూర్తి కావాల్సిన జనగణనలో కొన్ని మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇళ్లు పెరగాల్సి ఉండగా, తగ్గడంతో మళ్లీ పునర్విచారణ చేపట్టారు. దాదాపుగా 10 మండలాల్లో విచారణలు చేసి సమగ్ర నివేదికను కేంద్రానికి జిల్లా యంత్రాంగం నివేదించింది.
33 అంశాలతో ప్రశ్నావళి
జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్ గణన చేపట్టే ఇంటి యజమాని పేరుతో హెచ్ ఎల్‌వో (హౌస్ లిస్ట్ ఆపరేషన్) యాప్‌లోకి వెళ్లి ఒక ఐడీ క్రియేట్ చేశారు. దాని ఆధారంగా తమ వెంట ఉన్న ఫోన్‌లోనే ఇంటి స్వభావం, టాయిలెట్లు, గ్యాస్, వాహనాలు వినియోగించే విధానం, నీరు, కేబుల్ విని యోగం తదితర 33 అంశాలతో కూడి ప్రశ్నావళిని నింపారు. ఈ వివరాలను అత్యంత గోప్యంగా ఉంటాయని ఎన్యు మరేటర్లు వారికి వివరించి సక్సెస్ సాధించారు.
2011 జనాభా ఆధారంగా...
ఇళ్ల గణనను 2011 జిల్లా జనాభా ఆఽధారంగా చేపట్టారు. అప్పటి లెక్కల ప్రకారం జనాభా 20 లక్షల 6వేల 684 ఉంది. ఏలూరు కార్పొరేషన్‌లో తాజా లెక్కల ప్రకారం 1,07,919 ఇళ్లు ఉన్నట్లు తేల్చగా మిగతా నియోజవర్గాల్లోని 3 మూడు మున్సిపాల్టీలు, 27 మండలాల్లో 6,22,266 ఇళ్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇదిలా ఉండగా 51,659 ఇళ్లు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. 215 ఇళ్లకు తాళాలు వేసినట్లు తేల్చారు.
జిల్లాలో మండలాల వారీగా ఇళ్లు
కుక్కునూరులో 14,799, వేలేరుపాడులో 7,074, పోలవరంలో 13,543, బుట్టాయగూడెంలో 18,346, జీలుగుమిల్లిలో 14,632, టి.నర్సాపురంలో 21,774, చింతలపూడిలో 22,075, లింగపాలెంలో 20,147, కామవరపుకోటలో 20,220, జంగారెడ్డిగూడెంలో 26,116, కొయ్యలగూడెంలో 27,124, ద్వారకా తిరుమలలో 24,922, ఉంగుటూరులో 26,404, భీమడోలులో 15,456, దెందులూరులో 22,328, ఏలూరు రూరల్‌లో 12,660, పెదవేగిలో 27,503, పెదపాడులో 25,347, ముసునూరులో 18,026, చాట్రాయిలో 15,723, నూజివీడులో 26,599, ఆగిరిపల్లిలో 25,238, మండవల్లిలో 17,989, కైకలూరులో 27,769, ముదినేపల్లిలో 24,861, కలిదిండిలో 25,329, చింతలపూడి టౌన్‌లో 10,321, జంగారెడ్డిగూడెంలో 26,125, నూజివీడు టౌన్‌లో 22,041 ఇళ్లు లెక్క తేలాయి.
ఫిబ్రవరిలో వ్యక్తుల వారీగా గణన
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇప్పుడున్న ఇళ్ల ఆధారంగా ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల సమగ్ర వివరాలను సేకరించనున్నారు. తద్వారా జనాభా, ఏయే వృత్తులు ఎంత మంది చేస్తున్నారు, బీసీ,ఓసీ,ఎస్టీ,ఎస్సీ ఇతర వర్గాల జనాభా కూడా తేలే అవకాశం ఉంది. ఆయా వర్గాలకు ఇంకా అందించాల్సిన సంక్షేమ పథకాలపై కేంద్రం తగు చర్యలకు ఉపక్రమించనుంది.