కేంద్రీయ విద్యాలయానికి ఏడెకరాలు కేటాయింపు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:48 AM
నూజివీడులో కేం ద్రీయ విద్యాలయం నిర్మాణానికి పట్టణంలో ఏడు ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ప్రభుత్వం జీవో జారీ
నూజివీడు,ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):నూజివీడులో కేం ద్రీయ విద్యాలయం నిర్మాణానికి పట్టణంలో ఏడు ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2012లోనే ఇక్కడ కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రతిపాదించారు. అది పెండింగ్‌లో పడిపోగా, తాజాగా ప్రభుత్వం ఆర్‌ఎస్‌నెంబర్ 483/5బీ1బీ లోని ఏడు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయ నిర్మాణ సంస్థకు ఉచితంగా కేటాయిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ జీవోను జారీ చేశారు.