నాలుగో రోజు తగ్గని రద్దీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:59 AM
శుక్రవారం నుంచి మొదలైన సంక్రాంతి తిరుగు ప్రయాణికుల రద్దీ నాలుగో రోజు సోమవారం కూడా కొనసాగింది.
జిల్లా నుంచి 46 బస్సులు
నరసాపురం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): శుక్రవారం నుంచి మొదలైన సంక్రాంతి తిరుగు ప్రయాణికుల రద్దీ నాలుగో రోజు సోమవారం కూడా కొనసాగింది. ఇప్పటికే చాలా మంది శనివారం తిరుగుముఖం పట్టారు. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వారు ఆదివారం అమా వాస్య అయిన్పటికీ పట్టించుకోలేదు. సోమవా రం అంత రద్దీ ఉండదని భావించినప్పటికి ఉదయం నుంచి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిట కిటలాడాయి. చాలా మంది ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. నరసా పురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, తణుకు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో సందడి కనిపించింది. సాయంత్రం ప్రధాన స్టేషన్లన్నీ కిటకిటలాడిపో యాయి. నరసాపురంలో జనరల్ బోగీలు ఎక్కేందుకు ప్రయాణికులు క్యూ కట్టారు. ఇది స్టేషన్ బయట వరకు వచ్చేసింది. సివిల్ పోలీసులను రప్పించి క్యూలైన్ పాటింపజేశారు. దర్మవరం, లింగపల్లి, హుబ్లీ రైళ్లు స్టేషన్‌లోనే నిండుకున్నాయి. పాలకొల్లు భీమవరం, ఆకివీడు స్టేషన్లల్లో జనరల్ బోగీలు ఎక్కేందుకు ప్రయ త్నించిన వారికి సాధ్యం కాలేదు. నరసాపురం నుంచి సోమవారం వికారాబాద్ వరకు స్పెషల్ రైలు వేశారు. రాత్రి 8 గంటలకు ఈ రైలు బయలుదేరింది. మూడు జనరల్ బోగీలు జత చేశారు. అయినప్పటికీ ఫుల్ అయింది.
ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులు 30తోపాటు ప్రతి డిపో నుంచి సోమవారం నాలుగు స్పెషల్ బస్సులు నడిపింది. నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి మొత్తం 16 స్పెషల్ బస్సులు వెళ్లాయి.