Share News

పుష్కరాలకు 42 ఘాట్‌లు

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:42 AM

గోదావరి పుష్కరాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది.

పుష్కరాలకు 42 ఘాట్‌లు

జిల్లాలో రూ.50 కోట్లతో ప్రతిపాదనలు

అతి పెద్ద పుష్కరఘాట్‌ వలంధర్‌ రేవు

నరసాపురం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. గతం కంటే పుష్కర రేవులను పెంచాలని ఆదేశించడంతో అధికారులు ప్రతిపాద నలు చేశారు. గత పుష్కరాలకు జిల్లాలో 35 ఘాట్‌ లు ఉండగా ఈసారి 42 ఘాట్‌లు ఏర్పాటు చేయ నున్నారు. ఘాట్‌ల నిర్మాణం, మరమ్మతులకు రూ. 50 కోట్లు అంచనాతో ప్రతిపాదనలు పంపించారు.

అతి పెద్ద ఘాట్‌గా వలంధర్‌ రేవు

ప్రస్తుతం జిల్లాలో వలంథర్‌రేవు అతి పెద్ద స్నా నాల రేవు. ఒకేసారి లక్ష మంది స్నానం చేసే అవ కాశం ఉంది. 2 లక్షల మంది స్నానాలు చేసేలా రేవును విస్తరిస్తున్నారు. ప్రస్తుత 40 మీటర్ల పొడవు రేవును 60 మీటర్లకు లలితాంబ ఘాట్‌ వరకు విస్త రిస్తున్నారు. దానికి అనుగుణంగా రోడ్డును కూడా అభివృద్ధి చేయనున్నారు. సుమారు రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

పెరగనున్న రేవుల సంఖ్య

ప్రస్తుతం నరసాపురం తీరంలో 12 పుష్కర రేవు లు ఉన్నాయి. వాటిలో బుడితల రేవు, అమరేశ్వర, బాపు, కొండాలమ్మ, వలంథర్‌, స్మతివనం, నందమూరి కాలనీ, పీచుపాలెం, రాజుల్లంక, లక్ష్మణేశ్వరం, ధర్భరేవు, బియ్యపు తిప్ప వద్ద ఉన్నాయి. వీటిని 20కు పెంచ నుండగా అత్యధిక రేవులు పట్టణంలోనే అభివృద్ధి చేస్తున్నారు. ఇవి కాకుండా యలమంచిలి మండలంలో ప్రస్తుతం 7 రేవులను 12కి పెంచుతున్నారు. ఆచంట మండలంలో ప్రస్తుత రేవుల సంఖ్యను పెంచి పదికి విస్తరిస్తున్నారు.

వలంధర్‌ ఘాట్‌ విస్తరణ

గత పుష్కరాల్లో భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఈసారి రేవుల సంఖ్యను పెంచుతున్నాం. జిల్లాలో ప్రస్తుతం 35 రేవులు ఉన్నాయి. వీటిని 42కు పెంచు తున్నాం. ఈసారి వలంధర్‌రేవును విస్తరిస్తున్నాం. ఒకేసారి రెండు లక్షల మంది స్నానాలు చేసేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు రూ 2 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.

– పవన్‌, ఏటిగట్టు శాఖ ఏఈ

Updated Date - Jan 05 , 2026 | 12:42 AM