31 అనధికార లేఅవుట్ల ధ్వంసం
ABN , Publish Date - May 19 , 2026 | 12:42 AM
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ(ఈడా) పరిధిలో అన ధికారికంగా వెలిసిన 31 లే–అవుట్లలో ప్లాట్లకు వేసిన సరిహద్దు రాళ్లను అధికారులు సోమ వారం ధ్వంసం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించపోతే చర్యలు : ఈడా అధికారులు
ఏలూరు,మే18(ఆంధ్రజ్యోతి):ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ(ఈడా) పరిధిలో అన ధికారికంగా వెలిసిన 31 లే–అవుట్లలో ప్లాట్లకు వేసిన సరిహద్దు రాళ్లను అధికారులు సోమ వారం ధ్వంసం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి రాకుండా ప్లాట్లు, స్థలాలు క్రమబద్ధీకరించు కోకుండా ఉన్నవి ఈడా పరిధిలో 57 గుర్తించగా 31 చోట్ల 60 మంది సిబ్బందితో 15 ప్రత్యేక బృందాలు రంగంలో దిగి ఎక్సవేటర్లతో స్థలాలను ఽఽధ్వంసం చేశారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అదనపు డైరెక్టర్ వరప్రసాద్ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాలోని ఏలూరు, జంగా రెడ్డిగూడెం, కొయ్యల గూడెం, పెదపాడు, భీమఢోలు, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, మొగల్తూరు మండలాల్లో అనధికారిక లే–అవుట్లను ఽధ్వంసం చేశారు. ఈడా ప్లానింగ్ అధికారులు సురేఖ, వి. సుధాకర్, జూనియర్ ప్లానింగ్ అధికారులు టి.బాలాజీ, వై.కృష్ణ, ఇతర టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, వార్డు ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. అనధికారిక లే–అవుట్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.