మందుబాబుల పండుగ
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:33 AM
జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని బరుల వద్ద బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. ఒక్కో బాటిల్‌పైనే రూ.50 నుంచి రూ70 వరకు పెంచి అమ్మకాలు సాగించారు. పందెం రాయుళ్లు అక్కడే తినడం, తాగడం, బోర్లా పడటం జరిగింది.
మూడు రోజుల్లో రూ.30 కోట్లు తాగేశారు
ఏలూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని బరుల వద్ద బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. ఒక్కో బాటిల్‌పైనే రూ.50 నుంచి రూ70 వరకు పెంచి అమ్మకాలు సాగించారు. పందెం రాయుళ్లు అక్కడే తినడం, తాగడం, బోర్లా పడటం జరిగింది. మందుబాబుల చిందు లతో కోళ్ల పందేల వద్ద ఈ మూడు రోజులు వీక్షకులు పండుగ చేసుకున్నారు. గత ఏడా ది ఇదే సీజన్‌తో పోలిస్తే రూ.పది కోట్లపైనే అమ్మకాలు పెరిగాయి. పండుగ మూడు రోజులు వైన్ షాపుల్లో వ్యాపారాలు జోష్‌గా సాగాయి. వ్యాన్లు షాపులకు సరఫరా అయి న గంటల్లోనే స్టాక్‌ను మందుబాబులు ఊదేశారు. మూడు రోజులుగా జిల్లావ్యా ప్తంగా 155 లైసెన్సు మద్యం దుకాణాలు, బార్లు ద్వారా రూ.30 కోట్లపైనే అమ్మకాలు సాగాయి. గత ఏడాది కనుమ నాటికి జిల్లా లో రూ.57 కోట్ల అమ్మకాలు సాగగా, ఈ సారి రూ.68.34 కోట్ల మేర వ్యాపారం సాగింది. తెలంగాణ మద్యం అరికట్టడంతో పాటు విదేశీ మద్యం జిల్లాలో రాకుండా ఎక్సైజ్ శాఖ చెక్ పోస్టుల వద్ద భారీగా తని ఖీలు చేపట్టారు. నాటు సారాపైన అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. నూజి వీడు, చింతలపూడిల్లోను దాడులు చే సి పలువురిపై కేసులు నమోదు చేశారు.