Share News

23 నుంచి అండర్‌–19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:37 AM

అండర్‌–19 జిల్లా క్రీడాజట్ల ఎంపిక పోటీలు ఈనెల 23 నుంచి నిర్వహిస్తామని డీవీఈవో టి.శేఖర్‌బాబు, అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్‌, అంతకు లోపు చదువుతున్న బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు.

23 నుంచి అండర్‌–19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు

పెదవేగి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అండర్‌–19 జిల్లా క్రీడాజట్ల ఎంపిక పోటీలు ఈనెల 23 నుంచి నిర్వహిస్తామని డీవీఈవో టి.శేఖర్‌బాబు, అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్‌, అంతకు లోపు చదువుతున్న బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో నిర్ధేశించిన ప్రాంతాల్లో, నిర్ణయించిన తేదీల్లో ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని, అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరై, ప్రతిభతో జిల్లా జట్లకు ఎంపిక కావాలని తెలిపారు. ఈనెల 23దీన కరాటే, బాక్సింగ్‌, తైక్వాండో, రెజ్లింగ్‌ ఎంపిక పోటీలు ఏలూరు జిల్లా, పెదవేగిలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో బాల,బాలికలకు జరుగుతాయి. 24న కబడ్డీ, వాలీబాల్‌, హేండ్‌బాల్‌ పోటీలు ఏలూరు జిల్లా, ఏలూరు సెయింట్‌ థెరిస్సా జూనియర్‌ కళాశాలలో బాలికలు, 25న అథ్లెటిక్స్‌, జూడో, ఫుట్‌బాల్‌, హేండ్‌బాల్‌ పోటీలు ఏలూరు జిల్లా, పెదవేగిలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు ఉంటాయన్నారు. 26న వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, చెస్‌, యోగా పోటీలు ఏలూరు జిల్లా, పెదవేగి లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో బాలురకు, 28న నెట్‌బాల్‌, మాల్‌కబ్‌, షూటింగ్‌, ఆర్చరీ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలోని బ్రౌనింగ్‌ జూనియర్‌ కళాశాలలో బాల, బాలికలకు ఉంటాయన్నారు. 29న రగ్బీ, హాకీ, సెపక్‌ తక్రా పోటీలు ఏలూరు జిల్లా, పెదవేగిలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు, 30న బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, ఖోఖో, యోగా, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు పశ్చిమగోదావరి జిల్లా, తణుకులోని ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో బాలికలకు ఉంటాయన్నారు.

అక్టోబరు ఒకటిన క్రికెట్‌(బాల, బాలికలు), బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాడ్మింటన్‌ పోటీలు ఏలూరు జిల్లా, ఏలూరు సీఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో బాలురకు జరుగుతాయని, 2న సాప్ట్‌బాల్‌, బేస్‌బాల్‌ పోటీలు ఏలూరు జిల్లా, పెదవేగిలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు జరుగుతాయని వారు సూచించారు.

Updated Date - Sep 20 , 2026 | 12:37 AM