Share News

74 ఎకరాలకు విముక్తి

ABN , Publish Date - May 16 , 2026 | 01:04 AM

జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సత్వరం విముక్తి కల్పించేందుకు కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మెగామేళాకు విశేష స్పందన లభించింది.

74 ఎకరాలకు విముక్తి
అర్జీలను పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ తదితరులు

74 ఎకరాలకు విముక్తి

ఏలూరులో 22ఏ మెగా మేళా

290 మంది దరఖాస్తుదారులకు ఊరట

లబ్ధిదారులకు ఉత్తర్వుల అందజేత

కొత్తగా మరో 202 అర్జీలు..

15 రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలు

కైకలూరు నియోజకవర్గంలోని 771 ఎకరాల పరిష్కారం కోసం సీసీఎల్‌కు నివేదన

ఏలూరు జిల్లా రాష్ర్టానికే ఆదర్శం : ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఏలూరు, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సత్వరం విముక్తి కల్పించేందుకు కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మెగామేళాకు విశేష స్పందన లభించింది. కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో వ్యవహరిం చాయి. మొత్తం 290 మంది దరఖాస్తు దారులకు సంబంధించిన 74 ఎకరాలకు నిషేధిత జాబితాలో తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టరేట్‌ ఆవరణలోనే హెల్ప్‌డెస్క్‌లను మండలాల వారీగా ఏర్పాటు చేసి దరఖాస్తులను సరిచూసుకుని వేదికపై కలెక్టర్‌, నాదెండ్ల ప్రతి దరఖాస్తు ఆమూలాగ్రం పరిశీలించి.. లబ్ధిదారులను ముందు కూర్చొబెట్టుకుని పరిష్కారం చూపారు. కొత్తగా 202 అర్జీలు రాగా వీటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కైకలూరు నియోజకవర్గంలో 771 ఎకరాల భూముల పరిష్కారం కోసం సీసీఎల్‌కు నివేదించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 22ఏ నుంచి తొలగించిన ఉత్త ర్వులను వేదికపైనే అందించారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు, అర్జీదారులకు కలెక్టరేట్‌ యంత్రాంగం మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను చేసింది. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, విజయవాడ ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చాగంటి మురళీకృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జుత్తిగ నాగరాజు, వడ్డీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఘంటసాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ వినూత్న, డీఆర్వో ఎల్‌.దేవకిదేవి, ఆర్డీవోలు కిశోర్‌, జేవీ రమణ, సర్వేశాఖ ఏడీ ఎండీ అన్సారీ, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి నాంచారయ్య, వివిధ సెక్షన్ల సూపరింటెం డెంట్లు సీహెచ్‌ శేషగిరి, రవికుమార్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. కాగా సమావేశం ప్రారంభానికి ముందు డాగ్‌స్వ్కాడ్‌తో పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించడం కొంత చర్చకు దారితీసింది. కొంతకాలంగా ఈ విధంగా తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

పారదర్శక పాలనకు నిదర్శనం

మంత్రి నాదెండ్ల

22ఏ భూములకు పరిష్కారం చూపడంలో జిల్లా రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచింది. చాలావరకు సమస్య లను పరిష్కరించడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శ నం. 202 అర్జీలను రాబోయే 15 రోజుల్లోగా పరిష్కరి స్తారు. కొన్ని దేవదాయశాఖ భూములకు సంబంధిం చిన దరఖాస్తులు అందాయి. వాటిని నిర్దేశించిన సమ యంలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కావడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూశాం.

మంచి స్పందన వచ్చింది

కలెక్టర్‌ వెట్రిసెల్వి

22ఏ మెగా పరిష్కార మేళా కార్యక్రమాన్ని గత డిసెంబరులో విజయవంతంగా నిర్వహించి 1,199 భూ సమస్యలకు 1,147 దరఖాస్తులను పరిష్కరించాం. రెండో విడత మేళాలో ప్రజల నుంచి స్పందన వచ్చిం ది. త్వరలో అందరి దరఖాస్తులను పరిష్కరించి పేదల కు న్యాయం చేస్తాం.

Updated Date - May 16 , 2026 | 01:04 AM