సెప్టెంబరు 12న జాతీయ లోక్ అదాలత్
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:20 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తు న్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైౖర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి
ఏలూరు క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తు న్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైౖర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏలూరు జిల్లా కోర్టులో ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులను రాజీ చేస్తామన్నారు. కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కక్షిదారులు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులలో పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. కక్షిదారులు సంబంధిత పోలీస్ అధికారులను కానీ న్యాయస్థానాలను కానీ సంప్రదించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపార్టీలు గెలుపొందినట్టు అవుతుందన్నారు. కేసుల పరిష్కారంలో సలహాలు పొందడానికి 15100ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, ఇతర న్యాయమూర్తులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.